బర్డ్‌ఫ్లూతో నష్టపోతే పరిహారం
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:46 AM
బర్డ్‌ఫ్లూతో నష్టపోయిన పౌలీ్ట్ర రైతులకు పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదివారం ప్రకటించారు. సదుం మండలంలోని పుత్తావారిపల్లెలో రెండు కోళ్లఫారాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకిందని, మృతి చెందిన కోళ్లను ప్రత్యేక పద్ధతిలో ఖననం చేయాలని పశుసంవర్థక శాఖను కలెక్టర్ ఆదేశించారు.
మదనపల్లె టౌన్, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): బర్డ్‌ఫ్లూతో నష్టపోయిన పౌలీ్ట్ర రైతులకు పరిహారం చెల్లిస్తామని కలెక్టర్ నిశాంత్‌కుమార్ ఆదివారం ప్రకటించారు. సదుం మండలంలోని పుత్తావారిపల్లెలో రెండు కోళ్లఫారాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకిందని, మృతి చెందిన కోళ్లను ప్రత్యేక పద్ధతిలో ఖననం చేయాలని పశుసంవర్థక శాఖను కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడి బర్డ్‌ఫ్లూ ఇతర ప్రాంతాలకు సోకకుండా చూడాలన్నారు. ఇక్కడి కోళ్లను ఇతర ప్రాంతాలకు సరఫరా చేయొద్దని ఆదేశించారు. పరిస్థితులపై ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి నివేదికలు పంపుతున్నామన్నారు. పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి గుణశేఖర్ పిళ్లై విడుదల చేసిన ప్రకటన ప్రకారం కోళ్ల నుంచి మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. కోడి మాంసాన్ని 100 డిగ్రీల సెల్సియస్‌లో ఉడికించి తినాలన్నారు. సదుం మండలంలో బర్డ్‌ఫ్లూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎక్కడైనా కోళ్లలో అసాధారణ మరణాలు జరిగితే వెంటనే 70139 14401, 93982 62752 లకు ఫోన్ చేయాలని కోరారు.