పక్షుల పండుగకు రండి
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:08 AM
సూళ్లూరుపేట వేదికగా శని, ఆదివారాల్లో జరిగే పక్షుల పండుగకు రమ్మని ఆహ్వానం పలుకుతూ గురువారం తిరుపతిలో విద్యాశాఖ, టూరిజం ఆధ్వర్యంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఎస్వీయూ స్టేడియం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు ఈ ర్యాలీ సాగింది. పులికాట్ తీరాన పక్షుల పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాకు 42శాతం అడవులు, జలపాతాలు ఉన్నందున ట్రాకింగ్‌రూట్‌ను ప్రమోట్ చేయడానికి ఈ ఏడాది ఉబ్బలమడుగును ఈ ఫెస్టివల్‌లో తీసుకొచ్చామన్నారు. బీవీపాళెంనుంచి ఇరకం ఐల్యాండ్‌కు సర్క్యూట్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, పర్యాటకశాఖ ఆర్డీ రమణప్రసాద్, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ అధినేత రమే్‌షనాథ్ లింగుట్ల, డీఈవో కేవీఎన్‌కుమార్, సమగ్రశిక్ష సీఎంవో సురేస్, ఎంఈవో బాలాజీ, విద్యార్థులు పాల్గొన్నారు. మరోవైపు ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఆహ్వాన పత్రికలు అందించారు.
తిరుపతిలో విద్యార్థుల ర్యాలీ
తిరుపతి (కపిలతీర్థం)/సూళ్లూరుపేట, జనవరి 8(ఆంధ్రజ్యోతి): సూళ్లూరుపేట వేదికగా శని, ఆదివారాల్లో జరిగే పక్షుల పండుగకు రమ్మని ఆహ్వానం పలుకుతూ గురువారం తిరుపతిలో విద్యాశాఖ, టూరిజం ఆధ్వర్యంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. ఎస్వీయూ స్టేడియం నుంచి నాలుగు కాళ్ల మండపం వరకు ఈ ర్యాలీ సాగింది. పులికాట్ తీరాన పక్షుల పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జిల్లాకు 42శాతం అడవులు, జలపాతాలు ఉన్నందున ట్రాకింగ్‌రూట్‌ను ప్రమోట్ చేయడానికి ఈ ఏడాది ఉబ్బలమడుగును ఈ ఫెస్టివల్‌లో తీసుకొచ్చామన్నారు. బీవీపాళెంనుంచి ఇరకం ఐల్యాండ్‌కు సర్క్యూట్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్షీ, పర్యాటకశాఖ ఆర్డీ రమణప్రసాద్, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ అధినేత రమే్‌షనాథ్ లింగుట్ల, డీఈవో కేవీఎన్‌కుమార్, సమగ్రశిక్ష సీఎంవో సురేస్, ఎంఈవో బాలాజీ, విద్యార్థులు పాల్గొన్నారు. మరోవైపు ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రావాలంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పలువురు మంత్రులకు సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ ఆహ్వాన పత్రికలు అందించారు.