Share News

స్వచ్ఛ రఽథాలతో 5.5లక్షల కిలోల పొడి చెత్త సేకరణ

ABN , Publish Date - Sep 27 , 2026 | 01:32 AM

గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్ఛ రథాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి తెలిపారు. స్వచ్ఛ రఽథాల ద్వారా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 5.5లక్షల కిలోల పొడి చెత్తను సేకరించామన్నారు.

స్వచ్ఛ రఽథాలతో 5.5లక్షల కిలోల పొడి చెత్త సేకరణ
ప్రజల నుంచి చెత్త స్వీకరించి నిత్యావసరాలు అందజేస్తున్న పంచాయతీ సిబ్బంది

తిరుపతి(కలెక్టరేట్‌), సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచడంలో భాగంగా అమలు చేస్తున్న స్వచ్ఛ రథాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి తెలిపారు. స్వచ్ఛ రఽథాల ద్వారా ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 5.5లక్షల కిలోల పొడి చెత్తను సేకరించామన్నారు. ప్రజలు తమ ఇళ్లలోని కాగితాలు, ప్లాస్టిక్‌ కర్టన్లు తదితర పునర్వినియోగ పొడి వ్యర్థాలను స్వచ్ఛ రథాలకు అందించి వాటికి బదులుగా నిత్యావసర సరకులను పొందవచ్చన్నారు. దీనికి ఎలాంటి పరిమితి లేదని స్పష్టం చేశారు.

లక్కీడిప్‌

దసరా పండుగను పురస్కరించుకుని పొడి చెత్తను అందించే అలవాటును మరింత ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా లక్కీడిప్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీపీవో వెల్లడించారు. శనివారం నుంచి అక్టోబరు 24వతేదీ వరకు స్వచ్ఛ రథాల ద్వారా జరిగే లావాదేవీల్లో మూడు కిలోలకంటే ఎక్కువ పొడిచెత్తను ఇచ్చిన వారికి లక్కీడి్‌పలో పాల్గొనే అవకాశం ఉంటుందన్నారు. విజేతలకు మండలస్థాయిలో ఆకర్షణీయమైన బహుమతులు ప్రదానం చేస్తామని చెప్పారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పొడి చెత్తకు విలువ-స్వచ్ఛతకు ప్రోత్సాహం అనే సందేశంతో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రజలు భాగస్వామ్యాన్ని మరింత పెంచడంతోపాటు పునర్వినియోగం వ్యర్థాల సేకరణను విస్తృతం చేయడమే లక్ష్యమని తెలియజేశారు.

Updated Date - Sep 27 , 2026 | 01:32 AM