అధికారులకు ‘చిల్లర’ కష్టాలు..!
ABN , Publish Date - Oct 19 , 2026 | 02:17 AM
తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికారులకు ‘చిల్లర’ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మేయర్, కార్పొరేటర్ స్థానాలకు పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేసే సమయంలో అవసరమైన సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును రూపాయి, రెండు రూపాయల నాణేలను గోతాల్లో తీసుకొచ్చారు.
తిరుపతి సెంట్రల్, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికారులకు ‘చిల్లర’ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మేయర్, కార్పొరేటర్ స్థానాలకు పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థులు తమ నామినేషన్ దాఖలు చేసే సమయంలో అవసరమైన సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును రూపాయి, రెండు రూపాయల నాణేలను గోతాల్లో తీసుకొచ్చారు. ఈ చిల్లరను లెక్కించడానికి అధికారులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి జయకృష్ణను ఆంధ్రజ్యోతి ఫోన్లో సంప్రదించగా శనివారం మేయర్ స్థానానికి, ఆదివారం కార్పొరేటర్ల స్థానాలకు చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థులు రూపాయి, రెండు రూపాయల నాణేలను గోతాల్లో తీసుకొచ్చిన విషయం వాస్తవమేనని చెప్పారు. అయితే కావాలనే ఇలా చేశారా.. దీనివెనుక ఏదైనా కారణముందా? అన్నది చర్చనీయాంశమైంది.