Share News

సీఎం పర్యటన వాయిదా

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:08 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ఈనెల 17వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు రావాల్సివుండగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది.

సీఎం పర్యటన వాయిదా

తడ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి చంద్రబాబు సూళ్లూరుపేట పర్యటన వాయిదా పడింది. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించేందుకు ఈనెల 17వ తేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు రావాల్సివుండగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. అయితే ఈ కార్యక్రమం 24వ తేదీకి వాయిదా పడినట్లు శుక్రవారం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రకటించారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటన రద్దు కావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరిలో జరిగిన పక్షుల పండుగ చివరి రోజు ముఖ్యమంత్రి హాజరవుతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే చివర్లో ముఖ్యమంత్రి పర్యటన రద్దయింది.

Updated Date - Mar 14 , 2026 | 01:08 AM