సీఎం పర్యటన ఖరారు
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:31 AM
సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారైంది. అక్టోబర్ రెండో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో కలిసి మదనపల్లెలో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
- 2న మదనపల్లెలో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన
అన్నమయ్య, సెప్టెంబర్ 23(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన ఖరారైంది. అక్టోబర్ రెండో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో కలిసి మదనపల్లెలో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో ఆరు జిల్లాల్లో ఈ ప్రాజెక్టు అమలు కానుంది. కాగా, సీఎం కార్యక్రమ వేదిక ఎక్కడనేది ఇంకా ఖరారు కాలేదు. మదనపల్లె బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసే అవకాశముంది. దీంతోపాటు అనువైన ఇంకా కొన్ని ప్రదేశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. మదనపల్లె నియోజకవర్గంలో గతంలో రెండుసార్లు సీఎం పర్యటన ఖరారై చివరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే.