Share News

21, 22 తేదీల్లో సీఎం కుప్పం పర్యటన

ABN , Publish Date - Sep 12 , 2026 | 01:21 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ఈనెల 21, 22 తేదీల్లో పర్యటన దాదాపు ఖరారైంది. టీడీపీ వర్గాల సమాచారం మేరకు.. ఈనెల 21వ తేదీన చంద్రబాబు కుప్పం వస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.

21, 22 తేదీల్లో సీఎం కుప్పం పర్యటన

కుప్పం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ఈనెల 21, 22 తేదీల్లో పర్యటన దాదాపు ఖరారైంది. టీడీపీ వర్గాల సమాచారం మేరకు.. ఈనెల 21వ తేదీన చంద్రబాబు కుప్పం వస్తారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. హంద్రీ కాలువలో రెండో విడత కృష్ణా జలాలను శ్రీశైలం జలాశయంనుంచి విడుదల చేస్తారు. ఆరోజు రాత్రి ఇక్కడే బస చేస్తారు. 22వ తేది ద్రావిడ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో కడా అధికారులు నిమగ్నమయ్యారు. ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాల జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. అందుకు అనుగుణంగా ఆయా పనులను వేగవంతం చేస్తున్నారు. కడా పీడీ వికాస్‌ మర్మత్‌, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రారంభించారు. కాగా, సీఎం పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Updated Date - Sep 12 , 2026 | 01:21 AM