Share News

బాలుడి ప్రాణాలు కాపాడిన సీఎంఆర్‌ఎఫ్‌

ABN , Publish Date - May 14 , 2026 | 12:08 AM

చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌(సీఎంఆర్‌ఎఫ్‌) ఒక చిన్నారి జీవితాన్ని కాపాడింది. ఈ పథకం ద్వారా వచ్చిన నిధులతో బాలుడికి చేసిన లివర్‌ మార్పిడి చికిత్స విజయవంతమైంది.

బాలుడి ప్రాణాలు కాపాడిన సీఎంఆర్‌ఎఫ్‌
చిన్నారి కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

మదనపల్లె, మే 13(ఆంధ్రజ్యోతి): చీఫ్‌ మినిస్టర్‌ రిలీఫ్‌ ఫండ్‌(సీఎంఆర్‌ఎఫ్‌) ఒక చిన్నారి జీవితాన్ని కాపాడింది. ఈ పథకం ద్వారా వచ్చిన నిధులతో బాలుడికి చేసిన లివర్‌ మార్పిడి చికిత్స విజయవంతమైంది. మదనపల్లె మండలం వేంపల్లె హరిజనవాడకు చెందిన మాధవి, సోమశేఖర్‌ దంపతుల కుమారుడు వినయ్‌(8) అనారోగ్యంతో బాధ పడుతుండగా స్థానిక ఎమ్మెల్యేను సంప్రదించారు. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వినయ్‌కు లివర్‌ మార్పిడి చేయాలని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని బాధితులు ఎమ్మెల్యే ద్వారా సీఎం చంద్రబాబు దృష్టికి నేరుగా తీసుకెళ్లారు. వీరి వినతి మేరకు సీఎం సీఎం సహాయనిధి నుంచి రూ.8లక్షలు మంజూరు చేశారు. ఈ సొమ్ముతో లివర్‌మార్పిడి విజయవంతం కావడం, ఎనిమిదేళ్ల బిడ్డ అనారోగ్యం నుంచి కోలుకోవడంతో సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషాకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - May 14 , 2026 | 12:08 AM