నేడు శ్రీకాళహస్తికి సీఎం
ABN , Publish Date - Aug 30 , 2026 | 01:53 AM
టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్‌కు, తర్వాత చంద్రబాబుకు నమ్మిన బంటుగా క్రియాశీలక నాయకుడిగా పార్టీ అభివృద్ధికి కృషి చేసిన శాప్ మాజీ చైర్మన్,దివంగత పీఆర్ మోహన్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఆదివారం సీఎం చంద్రబాబు శ్రీకాళహస్తికి విచ్చేయనున్నారు.
- శాప్ మాజీ చైర్మన్ కుమార్తె వివాహానికి హాజరు
తిరుపతి(కలెక్టరేట్), ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్‌కు, తర్వాత చంద్రబాబుకు నమ్మిన బంటుగా క్రియాశీలక నాయకుడిగా పార్టీ అభివృద్ధికి కృషి చేసిన శాప్ మాజీ చైర్మన్,దివంగత పీఆర్ మోహన్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు ఆదివారం సీఎం చంద్రబాబు శ్రీకాళహస్తికి విచ్చేయనున్నారు. ఉదయం 10గంటలకు ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి 11.30గంటలకు శ్రీకాళహస్తి ఎంజీఎం ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన సీఆర్‌ఎన్ కండ్రిగ వద్ద ఉన్న సీసీఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు 11.55గంటలకు చేరుకుంటారు. అక్కడ పీఆర్ మోహన్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. తిరిగి ఎంజీఎం ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుని మధ్యాహ్నం 12.05గంటలకు అనంతపురానికి బయల్దేరి వెళతారు.మధ్యాహ్నం 1.30గంటలకు అనంతపురంలో జరిగే గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని ఉండవల్లికి తిరుగుపయనం కానున్నారు.