20న మదనపల్లెకు సీఎం రాక
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:33 AM
సీఎం చంద్రబాబు ఈనెల 20వ తేదీన మదనపల్లెకు రానున్నారు. జలధార-జలహారతిలో భాగంగా మండలంలోని చీకలబైలు పంచాయతీ కదిరమ్మ, వెంకటమ్మ చెరువులను పరిశీలించనున్నారు.
కదిరమ్మ, వెంకటమ్మ చెరువుల పరిశీలన
సభా స్థలాలను పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
మదనపల్లె, జూన్ 13(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఈనెల 20వ తేదీన మదనపల్లెకు రానున్నారు. జలధార-జలహారతిలో భాగంగా మండలంలోని చీకలబైలు పంచాయతీ కదిరమ్మ, వెంకటమ్మ చెరువులను పరిశీలించనున్నారు. ఈ మేరకు జేసీ శివనారాయణ శర్మ, ఇరిగేషన్ అధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో ఆ చెరువులను పరిశీలించారు. సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా, కలెక్టర్ నిశాంత్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీల, తహసీల్దార్ మాధవి శనివారం పట్టణంలో పర్యటించారు. హెలిప్యాడ్, సభాస్థలి, పార్కింగ్, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బి.టి.కళాశాల మైదానం, బెంగళూరు రోడ్డులో బిస్కెట్ ఫ్యాక్టరీకి ఎదురుగా ఉన్న ప్రైవేటు స్థలాన్ని, టిప్పుసుల్తాన్ మైదానాన్ని పరిశీలించారు. సీఎం కదిరమ్మ, వెంకటమ్మ చెరువుల క్షేత్రస్థాయి పర్యటన సాధ్యాసాధ్యాలపై ఆరా తీశారు.