Share News

నేడు కుప్పానికి సీఎం రాక

ABN , Publish Date - Jan 30 , 2026 | 02:40 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గంలో సీఎం పర్యటన కొనసాగనుంది. ఈసారి ప్రభుత్వ.. పార్టీ.. ప్రైవేటు కార్యక్రమాలను సమన్వయం చేసుకుని ముందుకు సాగనున్నారు.

నేడు కుప్పానికి సీఎం రాక

మూడు రోజులపాటు నియోజకవర్గ పర్యటన

కుప్పం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నియోజకవర్గంలో సీఎం పర్యటన కొనసాగనుంది. ఈసారి ప్రభుత్వ.. పార్టీ.. ప్రైవేటు కార్యక్రమాలను సమన్వయం చేసుకుని ముందుకు సాగనున్నారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, పీకేఎం ఉడా చైర్మన్‌ డాక్టర్‌ సురేశ్‌బాబు, ఏపీఎస్‌ ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ పీఎస్‌ మునిరత్నం ఆధ్వర్యంలో రాజకీయ కార్యక్రమాలు.. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, కడా పీడీ వికాస్‌ మర్మత్‌ నేతృత్వంలో ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ జరుగుతోంది. మొదటి రోజైన శుక్రవారం మధ్యాహ్నానికి గుడుపల్లె మండలం అగస్త్య ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోవడంతో చంద్రబాబు పర్యటన మొదలై.. ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణంతో ముగియనుంది. ఈ క్రమంలో గురువారం రాజకీయ, అధికార వర్గాలు తమ పరిధిలో ఆయా కార్యక్రమాలకు సంబంధించి సమీక్షలు జరిపారు. శాంతిపురం మండలం తుమ్మిశి వద్ద హెలిప్యాడ్‌ను, బహిరంగ సభా వేదికను సందర్శించారు. గుడుపల్లె మండలం బెగ్గిలపల్లె, కంగుంది తదితర ప్రాంతాలకు వెళ్లి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ జిల్లా, నియోజకవర్గ అధికారులతో ప్రత్యేక సమీక్షలు జరిపారు. నియోకవర్గ అభివృద్ధి నివేదికలు సిద్ధంగా ఉంచుకోవాల్సిందిగా ఆయా ప్రభుత్వ శాఖల అధికారులను ఆదేశించారు.

సీఎం పర్యటన ఇలా

ఫ శుక్రవారం

మధ్యాహ్నం 2.15 గంటలు: గుడుపల్లె మండలంలో అగస్త్య ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌లో టీచర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ భవన నిర్మాణానికి భూమిపూజ

3.15: కుప్పం మున్సిపాలిటీలో ప్రభుత్వ గ్రంథాలయంం, ఆదిత్య బిర్లా నైపుణ్యాభివృద్ధి కేంద్రం ప్రారంభం

4.30: కంగుందిలో హెరిటేజ్‌ సైట్‌ డెవల్‌పమెంట్‌ వర్క్స్‌ అండ్‌ బౌల్డరింగ్‌ పార్క్‌ ప్రారంభం. వంద అడుగుల ఎత్తయిన జాతీయ జెండా ఆవిష్కరణ

5.55: శాంతిపురం మండలం కడపల్లెలోని ఇంటికి చేరిక

శనివారం

ఉదయం 10.00: గుడుపల్లె మండలం బెగ్గిలపల్లెలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ

10.40: శాంతిపురం మండలం తుమ్మిశి మోడల్‌ స్కూల్‌ సమీపంలో సభ, ఈ సైకిళ్ల పంపిణీలో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కార్యక్రమం

02.00: ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు కంపెనీల స్టాళ్ల పరిశీలన

05.05: కడపల్లెలోని ఇంటికి

ఫ ఆదివారం

10.00: శాంతిపురం మండలం తుమ్మిశి సమీపంలో పార్టీ శ్రేణులతో సమావేశం

01.05: కడపల్లెలోని ఇంటికి.. సాయంత్రం తిరుగు ప్రయాణం

Updated Date - Jan 30 , 2026 | 02:40 AM