నెలాఖరులో కుప్పానికి సీఎం
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:55 AM
ఈ నెలాఖరులో సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనకు వస్తున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): ఈ నెలాఖరులో సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటనకు వస్తున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి సీఎం పర్యటనకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సోమవారం సాయంత్రం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కడా పీడీ వికాస్ మర్మత్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం పర్యటనలో భాగంగా సీఎం వివిధ సామాజిక భద్రతా పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తారన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాక 500మంది స్వయం సహాయక సంఘాల ప్రతినిధులకు రుణాలు అందిస్తారని చెప్పారు.పలు పరిశ్రమల స్థాపనకు ఒప్పందాలు జరుగుతాయన్నారు.కుప్పం బాలికల హాస్టల్‌ను ప్రారంభిస్తారని, ఐదువేలమందికి ఈ-సైకిల్‌ను పంపిణీ చేస్తారన్నారు. వికసిత్ భారత్ రోజ్‌గార్, అజీవిక మిషన్ పనుల కింద రూ.30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారన్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) వినతుల పరిష్కారంపై అధికారులతో సమీక్షిస్తారని చెప్పారు.సీఎం పర్యటనకు సంబంధించి శాఖలవారీగా అధికారులు నివేదికలను శుక్రవారంలోగా అందించాలని ఆదేశించారు. కుప్పం వద్ద హెలిప్యాడ్ పనులను ఆర్‌్క్షబీ శాఖ చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో మోహన్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.