7న జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం సమీక్ష
ABN , Publish Date - Feb 24 , 2026 | 01:12 AM
జిల్లాలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడం..దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపడం లక్ష్యాలుగా సీఎం చంద్రబాబు ఇటీవల జిల్లాలవారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు జిల్లా అధికారులతో సమీక్షలు జరుపుతున్న విషయం తెలిసిందే.
తిరుపతి (కలెక్టరేట్), ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడం..దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపడం లక్ష్యాలుగా సీఎం చంద్రబాబు ఇటీవల జిల్లాలవారీగా ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు జిల్లా అధికారులతో సమీక్షలు జరుపుతున్న విషయం తెలిసిందే.తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో పాటు కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడుతో మార్చి 7న సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.జిల్లాలో సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ వెంకటేశ్వర్ రూపొందించిన ప్రణాళికను సీఎంకు ఈ సందర్భంగా అందజేయనున్నారు.ఎమ్మెల్యేల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని కార్యాచరణ రూపొందించనున్నారు.