నేడు సీఎం చంద్రబాబు రాక
ABN , Publish Date - Jan 24 , 2026 | 02:17 AM
సీఎం చంద్రబాబు నాయుడు శనివారం నగరి పర్యటనకు రానున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేణిగుంట నుంచి నగరి జూనియర్ కళాశాలలో హెలిప్యాడ్ వద్దకు గురువారం మధ్యాహ్నం రెండుసార్లు హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
నగరి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు శనివారం నగరి పర్యటనకు రానున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేణిగుంట నుంచి నగరి జూనియర్ కళాశాలలో హెలిప్యాడ్ వద్దకు గురువారం మధ్యాహ్నం రెండుసార్లు హెలికాప్టర్ ట్రయల్ రన్ నిర్వహించారు. నగరి డిగ్రీ కళాశాల ఆవరణలోని క్రీడా మైదానంలో ప్రజావేదిక.. జూనియర్ కళాశాల సమీపంలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అక్కడి సభా ప్రాంగణ ఏర్పాట్లను ఎమ్మెల్యే భానుప్రకాష్, ఎంఎ్‌సఎంఏ డైరెక్టర్ చినబాబు, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎస్పీ తుషార్‌డూడి, ఆర్డీవో అనుపమ తదితరులు పర్యవేక్షించారు. సాయంత్రం 4 గంటలకు కాన్వాయ్ ట్రయల్ రన్‌తో గంటసేపు ట్రాఫిక్ ఆగిపోయింది. ప్రజా వేదికకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. పోలీసులకు బందోబస్తు విధులు కేటాయించారు.
ముఖ్యమంత్రి పర్యటన ఇలా..
నగరి/చిత్తూరు కలెక్టరేట్, జనవరి 23(ఆంధ్రజ్యోతి):
నగరిలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనపై శుక్రవారం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడారు నగరిలోని జూనియర్ కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌కు ఉదయం 11 గంటలకు చేరుకుంటారు. అక్కడే ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. రోడ్డు మార్గాన బయలుదేరి శాప్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర- స్వచ్చాంధ్ర ప్రజా వేదికకు చేరుకుంటారు. అక్కడ చిత్తూరు, బంగారుపాళ్యం, ఐరాలకు సంబంధించిన స్వచ్ఛరథాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.50 గంటలకు సాంఘిక సంక్షేమశాఖకు చెందిన బాలుర, బాలికల వసతి గృహాల వద్దకు చేరుకుని నెట్‌జీరో వేస్ట్ కాన్సె్‌ప్టను ప్రారంభిస్తారు. విద్యార్థులతో మాట్లాడతారు 2.15 గంటలకు ఏరియా ఆస్పత్రికి చేరుకుని అక్కడి రోగులతో మాట్లాడతారు. అనంతరం 2.40 గంటలకు జూనియర్ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుని టీడీపీ నేతలు, శ్రేణుల సమావేశంలో పాల్గొని వారికి దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం 3.55 గంటలకు హెలిప్యాడ్‌కు చేరుకుని తిరుగు ప్రయాణమవుతారు.