Share News

20న సీఎం చంద్రబాబు రాక

ABN , Publish Date - Mar 09 , 2026 | 02:02 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 20వ తేదీన జిల్లాకు రానున్నారు. తన మనవడు నారా దేవాన్ష్‌ పుట్టిన రోజు ఈనెల 21వ తేదీన కావడంతో చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కుటుంబీకులు ఎప్పటిలాగానే తిరుమలకు రానున్నారు.

20న సీఎం చంద్రబాబు రాక

తిరుపతి(కలెక్టరేట్‌), మార్చి 8 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఈనెల 20వ తేదీన జిల్లాకు రానున్నారు. తన మనవడు నారా దేవాన్ష్‌ పుట్టిన రోజు ఈనెల 21వ తేదీన కావడంతో చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కుటుంబీకులు ఎప్పటిలాగానే తిరుమలకు రానున్నారు. శుక్రవారం సాయంత్రం వారు కొండకు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేసి శనివారం ఉదయం తిరుమలేశుడిని దర్శించుకుంటారు. శనివారం దేవాన్ష్‌ పుట్టినరోజు సందర్భంగా తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నదానం చేయనున్నారు. ఒక్కరోజు అన్న ప్రసాద వితరణకు అయ్యే ఖర్చును టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు చంద్రబాబు కుటుంబం అందజేయనుంది.

Updated Date - Mar 09 , 2026 | 02:02 AM