Share News

4 రోజులు నారావారిపల్లెలోనే సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jan 10 , 2026 | 02:17 AM

సంక్రాంతి పండుగ జరుపకోవడానికి సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి నుంచి నాలుగు రోజులపాటు తన సొంతూరైన చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఉండనున్నారు. విజయవాడ నుంచి సోమవారం రాత్రికి సొంతూరుకు విచ్చేసే ఆయన మంగళ, బుధ, గురువారాల్లో గ్రామంలోనే ఉంటారు.

4 రోజులు నారావారిపల్లెలోనే సీఎం చంద్రబాబు

తిరుచానూరు, జనవరి 9(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ జరుపకోవడానికి సీఎం చంద్రబాబు సోమవారం రాత్రి నుంచి నాలుగు రోజులపాటు తన సొంతూరైన చంద్రగిరి మండలం నారావారిపల్లెలో ఉండనున్నారు. విజయవాడ నుంచి సోమవారం రాత్రికి సొంతూరుకు విచ్చేసే ఆయన మంగళ, బుధ, గురువారాల్లో గ్రామంలోనే ఉంటారు. ఈ సందర్భంగా రూ.140కోట్లతో శంకుస్థాపనలు, రూ.20కోట్లతోఏర్పాటు చేసిన అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించనున్నారు. చంద్రగిరి మండల ప్రజలకు సాగునీరు తిరుమల, తిరుపతికి తాగునీరు అందించేందుకు నీవా బ్రాంచ్‌ కెనాల్‌ నుంచి కల్యాణ్‌డ్యాంకు కృష్ణాజలాలను తీసుకురావడానికి రూ.రూ.126కోట్లతో మూలపల్లిచెరువు వద్ద మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, కుటుంబసభ్యులు, గ్రామస్థులతో సీఎం గడపనున్నారు. 14వ తేది స్వర్ణనారావారిపల్లె ప్రాజెక్టులో భాగంగా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌, టాటా డీఐఎంసీ, ఇందోర్‌ సబ్‌స్టేషన్‌, సీసీరోడ్లు ప్రారంభిస్తారు. రంగంపేట-బీమావరం నుంచి లింగేశ్వరాలయానికి వెళ్లే తారురోడ్డు, అనిమల్‌ హాస్టల్‌, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో మహిళలకు ఈ ఆటోలు పంపిణీచేస్తారు. 15న శెట్టిపల్లి లేఅవుట్‌ లబ్ధిదారులు 2,200మందికి లక్కీడీప్‌ ద్వారా పట్టాలు అందజేయనున్నారు. ఇక, మంత్రి లోకేశ్‌ కూడా షిర్డీ నుంచి సోమవారం రాత్రి 8.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని, రోడ్డు మార్గాన నారావారిపల్లెకు చేరుకోనున్నారు. 15వ తేదీన సీఎం తిరుగు ప్రయాణం కానున్నారు.

Updated Date - Jan 10 , 2026 | 02:17 AM