కొండపై బిజీబిజీగా సీఎం
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:09 AM
సీఎం తిరుమల పర్యటన ప్రశాంతంగా సాగింది.చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్థమాన్ జైన్ కుటుంబ సభ్యులతో కలిసి రూ.206 కోట్ల విలువైన 121 కేజీల బంగారు, వజ్రాభరణాలను శ్రీనివాసుడికి తయారు చేయించి గురువారం సమర్పించారు.ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటానని చంద్రబాబు ప్రకటించిన క్రమంలో టీటీడీలో హడావుడి వాతావరణం నెలకొంది. బంగారు ఆభరణాలను పటిష్ఠమైన భద్రత నడుమ శ్రీవారి ఆలయానికి తీసుకురావడం నుంచి సీఎం పర్యటన ప్రశాంతంగా సాగేలా ఇటు టీటీడీ అధికారులు, అటు జిల్లా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
సీఎం తిరుమల పర్యటన ప్రశాంతంగా సాగింది.చెన్నైకి చెందిన పారిశ్రామికవేత్త వర్థమాన్ జైన్ కుటుంబ సభ్యులతో కలిసి రూ.206 కోట్ల విలువైన 121 కేజీల బంగారు, వజ్రాభరణాలను శ్రీనివాసుడికి తయారు చేయించి గురువారం సమర్పించారు.ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటానని చంద్రబాబు ప్రకటించిన క్రమంలో టీటీడీలో హడావుడి వాతావరణం నెలకొంది. బంగారు ఆభరణాలను పటిష్ఠమైన భద్రత నడుమ శ్రీవారి ఆలయానికి తీసుకురావడం నుంచి సీఎం పర్యటన ప్రశాంతంగా సాగేలా ఇటు టీటీడీ అధికారులు, అటు జిల్లా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటలకు ఆభరణాలను ప్రత్యేక వాహనంలో తీసుకువచ్చారు. 10 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో సహా వర్థమాన్ జైన్ ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం సీఎం చంద్రబాబు దంపతులు కూడా తిరుమలకు చేరుకుని సంప్రదాయ వస్త్రదారణతో క్యూలైన్ ద్వారా ఆలయంలోని రంగనాయకమండపానికి చేరుకుని అప్పటికే ప్రదర్శనలో ఉంచిన ఆభరణాలను తిలకించారు. అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. మరోసారి రంగనాయక మండపానికి చేరుకుని ఆభరణాలతో ఊరేగింపుగా గర్భాలయానికి వెళ్లారు.ఇలా దాదాపు గంట వరకు ఆలయంలోనే బిజీగా గడిపారు. ఆలయం వెలుపల, దర్శనానికి వెళ్లే క్రమంలో పలువురు భక్తులను చూస్తూ ఆభివాదం చేశారు. కొందరి సమీపానికి వెళ్లి పలకరించారు. అనంతరం వర్థమాన్ జైన్‌తో కలిసి పద్మావతి అతిథిగృహానికి చేరుకుని 30 నిమిషాల పాటు మీడియా సమావేశంలో పాల్గొని వివరాలను వెల్లడించారు. విరాళం ప్రాధాన్యతను మీడియాకు వివరించడంతో పాటు భవిష్యత్ ప్రణాళిక, ఆలయ చరిత్ర, గొప్పదనం, విశిష్టత, సంక్షేమం, సామాజిక బాధ్యత వంటివాటిని వివరించారు. ‘వృక్షగోవిందం’ పేరుతో పచ్చదనం పెంపు కార్యక్రమాలను చేపడతామన్న ఆయన శ్రీవారి సన్నిధిలోనూ నీళ్లు లేని పరిస్థితి వస్తోందని, దీనికి కారణం ఈసారి ఎల్‌నినో రావడమన్నారు.అయినప్పటికీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.హంద్రీ-నీవా నుంచి కల్యాణిడ్యాముకు నీరు తీసుకురావడంతో పాటు సోమశిల నీటిని కూడా బాలాజీ రిజర్వాయర్ ద్వారా తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. అనంతరం తిరుమల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.