పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యత
ABN , Publish Date - Jun 02 , 2026 | 01:22 AM
పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యతని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.తిరుపతిలోని ఎల్‌ఎస్ నగర్‌లో సోమవారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టారు.
తిరుపతి సెంట్రల్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రత ప్రతి పౌరుడి బాధ్యతని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు.తిరుపతిలోని ఎల్‌ఎస్ నగర్‌లో సోమవారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపట్టారు. వరదనీటి కాలువలో పేరుకుపోయిన చెత్తను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డితో కలిసి కలెక్టర్ శుభ్రం చేశారు. అనంతరం స్థానికులు, అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ కాలనీలో చెత్త తొలగింపు, డ్రైనేజీ శుభ్రపరిచే పనులను ప్రజా భాగస్వామ్యంతో చేపడితే సత్పలితాలు వస్తాయన్నారు.కాలనీల్లో చెత్త కుప్పలు, నిల్వ నీరు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. దీనికి ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రధాన మురుగునీటి కాలువల్లో వ్యర్థాలు వేయవద్దని సూచించారు.నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాసులు, జనసేన నేతలు రాజారెడ్డి, ఆముదాల తులసీరాం, మురళీనాధ రెడ్డి, భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ సత్యనారాయణ, 22వ వార్డు టీడీపీ అధ్యక్షుడు బాల, డేనియల్, నగర పాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ శారదాదేవి, డీసీ అమరయ్య, మున్సిపల్ హెల్త్ అధికారి యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.