వసతి గృహ విద్యార్థులకు శుద్ధ జలం
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:58 AM
సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహ విద్యార్థులఈకు శుద్ధ జలం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత నెలలో మినరల్ వాటర్ ప్లాంట్ల యంత్రాలను అందించగా, 42 హాస్టళ్లలో అమర్చారు. జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పరిఽధిలో మూడో తరగతి నుంచి పీజీ వరకు 49 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో ఏడు వరకు ప్రైవేటు భవనాల్లో ఉన్నాయి.
42 హాస్టళ్లలో మినరల్ వాటర్‌ప్లాంట్లు
త్వరలో మరో ఏడింటిలో ఏర్పాటు
చిత్తూరు అర్బన్, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహ విద్యార్థులఈకు శుద్ధ జలం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత నెలలో మినరల్ వాటర్ ప్లాంట్ల యంత్రాలను అందించగా, 42 హాస్టళ్లలో అమర్చారు. జిల్లాలో సాంఘిక సంక్షేమశాఖ పరిఽధిలో మూడో తరగతి నుంచి పీజీ వరకు 49 వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో ఏడు వరకు ప్రైవేటు భవనాల్లో ఉన్నాయి. ఈ హాస్టళ్లలో దాదాపు 3800 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరికి ఆరోగ్యంతో పాటు దంత సమస్యలు అధికంగా వస్తుంటాయి. దీనికి కారణం శుద్ధమైన నీరు తాగకపోవడమేనని ప్రభుత్వం గుర్తించింది. అందుకని ఫిబ్రవరిలో 7, మార్చి నెలలో 21 వసతి గృహాలకు మినరల్ వాటర్ ప్లాంట్ యంత్రాలను పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పీఎం అజయ్ స్కీమ్ కింద నిధులను విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించి యంత్రాలను పంపిణీ చేసింది. కాగా, ఇప్పటికే 14 హాస్టళ్లలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఉండగా, మరో ఏడింటిలో అమర్చాల్సి ఉంది. ఇక, వైసీపీ హయాంలో వసతి గృహాల నిర్వహణను గాలికి వదిలేశారు. తాగునీటి కోసం విద్యార్థులు, వార్డెన్లు ఇబ్బంది పడేవారు. సకాలంలో డైట్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో వార్డెన్లు అప్పుతో కూరగాయలు, చికెన్, అరటి పండ్లు తీసుకొచ్చేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గతేడాది వసతి గృహాల్లో మౌలిక వసతుల మరమ్మతుల కోసం రూ.15 కోట్ల వరకు ఖర్చుపెట్టింది. ఈ నిధులతో కిటికీలు, తలుపులు, పైపులైన్లు, ఫ్యాన్లు, పెయింటింగ్, ప్రహరీలతో పాటు విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించింది. ఇప్పుడు మినరల్ వాటర్‌ప్లాంట్లను అమర్చింది. దీంతో ఈ ఏడాది వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.