Share News

నెల రోజుల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాలు ఇవ్వాలి

ABN , Publish Date - Aug 01 , 2026 | 02:26 AM

ముసాయిదా ఓటరు జాబితాలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఆగస్టు 30వ తేదీలోపు ఇవ్వాలని డీఆర్‌వో వెంకటేశు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు నకలు కాపీలను అందజేశారు.

నెల రోజుల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాలు ఇవ్వాలి
టీడీపీ నేతలకు ముసాయిదా ఓటరు జాబితా అందిస్తున్న డీఆర్‌వో వెంకటేశు

మదనపల్లె టౌన్‌,జూలై 31(ఆంధ్రజ్యోతి): ముసాయిదా ఓటరు జాబితాలో క్లెయిమ్‌లు, అభ్యంతరాలను ఆగస్టు 30వ తేదీలోపు ఇవ్వాలని డీఆర్‌వో వెంకటేశు పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసి, అన్ని రాజకీయ పార్టీ నాయకులకు నకలు కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటలైజేషన్‌ చేయించుకోలేని వారు పేర్లను నమోదు అవకాశం ఉందన్నారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండేందుకు రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమన్నారు. ముసాయిదా ఓటరు జాబితా జిల్లాలోని 1,334 మంది బీఎల్‌వోల వద్ద ఉంటాయని, ప్రజలు వారిని సంప్రదించి ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 02:26 AM