నేడే ‘పుర’ పోరు
ABN , Publish Date - Nov 01 , 2026 | 01:45 AM
జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల్లో ఆదివారం జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం 377 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు బందోబస్తు కల్పించాల్సిన పోలీసులూ శనివారం సాయంత్రమే చేరుకున్నారు. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ ఉంటుంది. 3వ తేదీన ముందుగా ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తారు.
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్
ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం
ప్రతి పోలింగ్ కేంద్రంపై కెమెరా నీడ
ముందురోజే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
నాలుగు మున్సిపాలిటీల్లో 286 మంది అభ్యర్థులు
చిత్తూరు, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒక కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల్లో ఆదివారం జరిగే పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. మొత్తం 377 పోలింగ్ కేంద్రాలకు సిబ్బందితో పాటు బందోబస్తు కల్పించాల్సిన పోలీసులూ శనివారం సాయంత్రమే చేరుకున్నారు. ఆదివారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ ఉంటుంది. 3వ తేదీన ముందుగా ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో పటిష్టం..
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కెమెరాల నిఘా పరిధిలోకి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలు, మరికొన్ని చోట్ల రికార్డింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలను హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్‌గా విభజించారు. హైపర్, సెన్సిటివ్ కేంద్రాల్లో పోలీసులు అదనంగా పనిచేస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీల్లో 52 సెన్సిటివ్, 44 హైపర్ సెన్సిటివ్ కేంద్రాలున్నాయి. ఆదివారం నాటి పోలింగ్ విధుల్లో 1049 మంది పోలీసులు పాల్గొంటున్నారు.
2.80 లక్షల మంది ఓటర్లు
చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు నగరి, కుప్పం, పలమనేరు మున్సిపాలిటీల్లో 2.80 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఎక్కడా వంద శాతం ఏకగ్రీవాలు లేకపోవడంతో అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు మున్సిపాలిటీల్లో 168 వార్డులుండగా, చిత్తూరులో 51, కుప్పంలో 13, పలమనేరులో 6, నగరిలో 4 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 94 వార్డుల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. నగరి మున్సిపల్ చైర్మన్ ఇప్పటికే ఏకగ్రీవం కావడంతో అక్కడ మినహా కుప్పం, పలమనేరు చైర్మన్‌తో పాటు చిత్తూరు మేయర్ స్థానానికి పోలింగ్ ఉంటుంది.
286 మంది అభ్యర్థులు
చిత్తూరులో 9 డివిజన్లలో 47 మంది.. కుప్పంలో 19 వార్డుల్లో 52 మంది.. పలమనేరులో 30 వార్డుల్లో 64.. నగరిలోని 36 వార్డుల్లో 108 మంది బరిలో ఉన్నారు. చైర్మన్లకు సంబంధించి పలమనేరులో ముగ్గురు, కుప్పంలో ఆరుగురు, చిత్తూరు మేయర్‌కు ఆరుగురు పోటీ పడుతున్నారు. మొత్త వార్డు స్థానాలకు 271 మంది, చైర్మన్ స్థానాలకు 15 మంది చొప్పున 286 మంది బరిలో ఉన్నారు.
పోలింగ్‌లో చిత్తూరు వెనుకబాటు
ఉద్యోగులు, విద్యావంతులు అధికంగా ఉన్న పట్టణాల్లో సహజంగానే పోలింగ్ శాతం తక్కువగా ఉంటుంది. అలాంటిది జిల్లా కేంద్రం చిత్తూరులో ఆ పోలింగ్ శాతం మరింతగా తగ్గిపోతోంది. 2021 ఎన్నికల్లో చూసుకుంటే చిత్తూరులో 66.91ు, పలమనేరులో 71.30ు, నగరిలో 76.33ు, కుప్పంలో 76.84ు పోలింగ్ నమోదైంది. ఇదే తరహాలో 2014, 2005 స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మిగిలిన మున్సిపాలిటీలతో పోల్చుకుంటే చిత్తూరు బాగా వెనుకబడింది. ఈ క్రమంలో ఆదివారమైనా ఓటర్లు ముందుకొచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.