జీఎస్టీ స్కాం కేరాఫ్ చిత్తూరు
ABN , Publish Date - Oct 04 , 2026 | 01:30 AM
చిత్తూరు కేంద్రంగా స్ర్కాప్- జీఎస్టీ స్కాం సాగుతున్న విషయం బహిరంగ రహస్యమే. అమాయకుల ఆధార్, పాన్, బ్యాంకు వంటి వివరాలను సేకరించి వారి పేర్లతో జీఎస్టీ రిజిస్ర్టేషన్లు పొందుతారు. వ్యాపారం జరగకపోయినా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు చూపించి నకిలీ ఇన్‌వాయి్‌సల ద్వారా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు చూపిస్తారు. ఈ వ్యవహారాన్ని చిత్తూరుకు చెందిన ముగ్గురు ముఠాగా మారి నడిపిస్తున్నారు. చిత్తూరు న్యూ కైనకట్టు వీధికి చెందిన ఎం.రెహ్మాన్ ఖాన్‌ను పలమనేరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో ఇప్పటివరకు విడివిడిగా వెలుగులోకి వచ్చిన పలు జీఎస్టీ ఫిర్యాదులు, లావాదేవీల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై పోలీసులు, జీఎస్టీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది. 5నెలల్లో రూ.36 కోట్ల లావాదేవీలు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన లారీడ్రైవర్ సయ్యద్ సమీర్ పేరుతో సుమారు రూ.36 కోట్ల మేర జీఎస్టీ లావాదేవీలు ఐదు నెలల్లో నమోదైనట్లు వెలుగులోకి రావడం ఈ తాజా వ్యవహారానికి కారణమైంది. తనకు తెలియకుండానే తన ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్ వివరాలను ఉపయోగించి ‘ఎస్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో జీఎస్టీ రిజిస్ర్టేషన్ పొందారని బాధితుడు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీ లోడ్ ఇప్పిస్తామని నమ్మించి పత్రాలను తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొనగా.. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అమాయకుల పేరిట లావాదేవీలతో టోకరా
భారీ మొత్తంలో నకిలీ ఐటీసీ క్లయిమ్‌లు
పలమనేరు పోలీసుల అదుపులో నిందితుడు రెహ్మాన్
చిత్తూరు, అక్టోబరు3(ఆంధ్రజ్యోతి): చిత్తూరు కేంద్రంగా స్ర్కాప్- జీఎస్టీ స్కాం సాగుతున్న విషయం బహిరంగ రహస్యమే. అమాయకుల ఆధార్, పాన్, బ్యాంకు వంటి వివరాలను సేకరించి వారి పేర్లతో జీఎస్టీ రిజిస్ర్టేషన్లు పొందుతారు. వ్యాపారం జరగకపోయినా కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు చూపించి నకిలీ ఇన్‌వాయి్‌సల ద్వారా ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు చూపిస్తారు. ఈ వ్యవహారాన్ని చిత్తూరుకు చెందిన ముగ్గురు ముఠాగా మారి నడిపిస్తున్నారు. చిత్తూరు న్యూ కైనకట్టు వీధికి చెందిన ఎం.రెహ్మాన్ ఖాన్‌ను పలమనేరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామంతో ఇప్పటివరకు విడివిడిగా వెలుగులోకి వచ్చిన పలు జీఎస్టీ ఫిర్యాదులు, లావాదేవీల వెనుక ఉన్న నెట్‌వర్క్‌పై పోలీసులు, జీఎస్టీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది.
5నెలల్లో రూ.36 కోట్ల లావాదేవీలు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన లారీడ్రైవర్ సయ్యద్ సమీర్ పేరుతో సుమారు రూ.36 కోట్ల మేర జీఎస్టీ లావాదేవీలు ఐదు నెలల్లో నమోదైనట్లు వెలుగులోకి రావడం ఈ తాజా వ్యవహారానికి కారణమైంది. తనకు తెలియకుండానే తన ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్ వివరాలను ఉపయోగించి ‘ఎస్‌ఎస్ ఎంటర్‌ప్రైజెస్’ పేరుతో జీఎస్టీ రిజిస్ర్టేషన్ పొందారని బాధితుడు పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లారీ లోడ్ ఇప్పిస్తామని నమ్మించి పత్రాలను తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొనగా.. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల అదుపులో రెహ్మాన్ ఖాన్
లారీ డ్రైవర్ సమీర్ పేరుతో జీఎస్టీ రిజిస్ర్టేషన్ పొంది రూ.36 కోట్ల లావాదేవీలు చేసిన వ్యక్తి చిత్తూరు నగరానికి చెందిన రెహ్మాన్ అని పలమనేరు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో ప్రమేయం లేకున్నా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని నిందితుడు రెహ్మాన్ హైకోర్టును ఆశ్రయించాడు.
ఈ స్కామ్ ఎలా చేస్తారంటే..
జీఎస్టీ స్కామ్ నెట్‌వర్క్‌కు చిత్తూరే ప్రారంభ కేంద్రంగా ఉంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులు, రోజువారి కూలీలు, చిన్న వ్యాపారులు, లారీ డ్రైవర్లకు కొంత మొత్తాన్ని ఇచ్చి వారి ఆధార్, పాన్, ఫోటోలు తదితర వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వివరాలతో నకిలీ మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు ఉపయోగించి జీఎస్టీ రిజిస్ర్టేషన్లు పొందుతారు. అనంతరం ఆయా వ్యక్తుల పేర్లతో సంస్థలు, బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేస్తారు. వాస్తవంగా సరుకు (స్ర్కాప్) కొనుగోలు, అమ్మకాలు జరగకపోయినా బోగస్ ఇన్‌వాయి్‌సలు సృష్టించి లావాదేవీలు జరిగినట్లు చూపిస్తారు. ఈ లావాదేవీల ఆధారంగా ఐటీసీ(ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్) క్లెయిమ్ చేస్తున్నట్లు సమాచారం.
రూ.100 కోట్లకుపైగా నకిలీ ఐటీసీ
జీఎస్టీ స్కామ్‌లో సుమారు రూ.వంద కోట్లకుపైగా నకిలీ ఐటీసీ క్లయిమ్‌లు ఉన్నట్లు సమాచారం. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన అంతరాష్ట్ర లావాదేవీల విలువ దీనికంటే చాలా ఎక్కువగా ఉండొచ్చని అధికారుల అంచనా. జిల్లాలోనే సుమారు 450 మంది వరకు వ్యక్తుల వివరాలు దుర్వినియోగమై ఉండొచ్చని భావిస్తున్నారు. తమ పేర్లతో సంస్థలు, భారీ టర్నోవర్ నడుస్తున్న విషయం కూడా వారికి తెలియకపోవచ్చంటున్నారు.
విజయచక్రవర్తి కేసుతో ముందే వెలుగులోకి..
చిత్తూరుకు చెందిన విజయచక్రవర్తి 2018లో మదీనా స్టీల్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేశాడు. 2019 అక్టోబరులో ప్రభుత్వ వైన్ షాపులో ఉద్యోగం రావడంతో మదీనా స్టీల్స్‌లో ఉద్యోగం మానేశాడు. 2025 ఆగస్టులో రూ.92,082 చెల్లించాలని అతనికి జీఎస్టీ నోటీసు వచ్చింది. మళ్లీ అదే నెలలో రూ.41,81,084 చెల్లించాలని మరో నోటీసు వచ్చింది. స్ర్కాప్, జీఎస్టీ స్కామ్ గురించి విని గతంలో పనిచేసిన మదీనా స్టీల్స్ యజమాని షేక్ రిజ్వాన్‌ను కలిశాడు. నోటీసుపై నిలదీశాడు. విజయ్‌చక్రవర్తి పేరుపై వ్యాపారం చేశానని రిజ్వాన్ ఒప్పుకున్నాడు. సమస్య నుంచి బయటపడేయడానికి తన వద్ద జీఎస్టీ అధికారులు ఉన్నారని రిజ్వాన్ చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. పైన చెప్పుకున్నట్లు మొత్తం విషయాన్ని విజయచక్రవర్తి గతేడాది చివరిలో కేంద్ర హోంమంత్రి కి ఫిర్యాదు చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు.
ముఠాలో కీలక పాత్రధారి రిజ్వాన్
చిత్తూరు కేంద్రంగా నడుస్తున్న జీఎస్టీ స్ర్కాప్ స్కామ్ వెనుక ఉన్న ముఠాలో రిజ్వాన్ అనే వ్యక్తి కీలకంగా మారినట్లు తెలుస్తోంది. అంతకుముందు అనధికారికంగా అందరికీ అతని పేరు తెలిసినా.. విజయచక్రవర్తి వ్యవహారంతో అతని పేరు అధికారికంగా బహిర్గతమైంది. తాజాగా పోలీసుల అదుపులో ఉన్న రెహ్మాన్‌తో పాటు అదే సామాజికవర్గానికి చెందిన మరో వ్యక్తి కూడా ఈ ముఠాలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమంతా జీఎస్టీ అధికారులకు, పోలీసులకు తెలిసినా పట్టించుకోవడం లేదనేది బహిరంగ సత్యం. జీఎస్టీ రిజిస్ర్టేషన్ బ్రోకర్లు, ఫైనాన్స్ ఏజెంట్లు, డిజిటల్ సర్వీస్ సెంటర్ల సిబ్బంది, షెల్ సంస్థల నిర్వాహకులు తదితరులు కలిపి 50 మందికిపైగా ఈ నెట్‌వర్కుతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఇక్కడి స్కామ్ ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన సంస్థల ద్వారా ఇన్‌వాయి్‌సలు, బెంగళూరు చెందిన బ్యాంకు ఖాతాల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తున్నట్లు సమాచారం.