Share News

ఈస్ట్‌ కోస్టల్‌ పరిధిలోకి చిత్తూరు రైల్వేస్టేషన్‌

ABN , Publish Date - Jun 02 , 2026 | 01:16 AM

పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈస్ట్‌ కోస్టల్‌ పరిధిలోకి చిత్తూరు రైల్వేస్టేషన్‌ చేరింది. ఈ పరిణామం హర్షణీయమని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు.

ఈస్ట్‌ కోస్టల్‌ పరిధిలోకి చిత్తూరు రైల్వేస్టేషన్‌
ఎంపీకి కేక్‌ తినిపిస్తున్న రైల్వే అధికారులు

హర్షం వ్యక్తంచేస్తూ కేక్‌ కట్‌ చేసిన ఎంపీ దగ్గుమళ్ల

చిత్తూరు రూరల్‌, జూన్‌ 1(ఆంధ్రజ్యోతి): పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా ఈస్ట్‌ కోస్టల్‌ పరిధిలోకి చిత్తూరు రైల్వేస్టేషన్‌ చేరింది. ఈ పరిణామం హర్షణీయమని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. ఈస్ట్‌ కోస్టల్‌ రైల్వే జోన్‌గా విశాఖపట్నం అయిన సందర్భంగా సోమవారం చిత్తూరు రైల్వేస్టేషన్‌లో ఎంపీ ఆధ్వర్యంలో కేక్‌కట్‌ చేశారు. ఆంధ్రుల దశాబ్దాల కల సాకారమైందని దగ్గుమళ్ల పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌ కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ అహర్నిశలు శ్రమించారన్నారు. 2019 ఎన్నికలకు ముందే కేంద్రప్రభుత్వం రైల్వే జోన్‌ ఏర్పాటుకు ప్రకటన చేసినా, గత వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. భూములు అప్పగించాలని కేంద్రం ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు చొరవతో విభజన హామీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. చిత్తూరు రైల్వేస్టేషన్‌ను ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతామని ఎంపీ అన్నారు. అనంతరం రాష్ట్రప్రభుత్వం తరపున విశాఖ రైల్వే జోన్‌ కోసం కృషి చేసిన చిత్తూరు ఎంపీని రైల్వే అధికారులు, కూటమి నాయకులు సత్కరించారు. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కోరుతూ, తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్‌ సాధన సమితి సభ్యులు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. రైల్వే కూలీల సమస్యల పరిష్కారించాలని కోరుతూ రైల్వే ఉద్యోగుల సంఘం నాయకులు అర్జీ సమర్పించారు.

Updated Date - Jun 02 , 2026 | 01:16 AM