Share News

పంచాయతీల్లో రాష్ట్రంలోనే చిత్తూరు ఫస్ట్‌!

ABN , Publish Date - Apr 01 , 2026 | 01:49 AM

పంచాయతీల స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలన్నా, సొంత పనులు చేపట్టాలన్నా, ప్రజా అవసరాలను తీర్చాలన్నా పన్ను ఆదాయం సమకూర్చుకోవాలి. ఆ మేరకు జిల్లాలో అధికారులు లక్ష్యాలను నిర్దేశించి ఎట్టకేలకు పన్ను వసూళ్లను సాధించారు.

పంచాయతీల్లో రాష్ట్రంలోనే చిత్తూరు ఫస్ట్‌!

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 31(ఆంధ్రజ్యోతి): పంచాయతీల స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలన్నా, సొంత పనులు చేపట్టాలన్నా, ప్రజా అవసరాలను తీర్చాలన్నా పన్ను ఆదాయం సమకూర్చుకోవాలి. ఆ మేరకు జిల్లాలో అధికారులు లక్ష్యాలను నిర్దేశించి ఎట్టకేలకు పన్ను వసూళ్లను సాధించారు. అనధికారిక సమాచారం మేరకు.. పన్ను వసూళ్లలో చిత్తూరు జిల్లా 95.33 శాతం వృద్ధి సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు తెలిసింది. 2025-26 పన్నులు, పన్నేయేతర వసూళ్లు రూ. 27.04 కోట్లు కాగా మంగళవారం నాటికి రూ. 25.87 కోట్లు వసూళ్లు సాధించింది. పన్నుల రూపేణా రూ. 20.09 కోట్ల లక్ష్యంలో రూ.19.30 కోట్లు(96.09 శాతం) వసూళ్లు జరిగింది. పన్నుయేతర వసూళ్లలో రూ. 6.95 కోట్ల లక్ష్యంలో రూ.6.57 కోట్లు(94.57 శాతం) వృద్ధి సాధించింది. రోజువారీ లక్ష్యాలను నిర్దేశించి అధికారులు రాత్రి వేళల్లో వసూళ్లపై సమీక్ష చేస్తూ వచ్చారు. లక్ష్యాలు దాటాల్సిందేనని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పంచాయతీ కార్యదర్శులకు అల్టిమేటమ్‌ ఇచ్చారు. మరోవైపు వందశాతం పన్ను వసూళ్లు చేయని కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఆదేశిస్తూ మార్గదర్శకాలను ఇచ్చింది. దాంతో 95.33 శాతం మేరకు వసూళ్లు జరిగాయి.

Updated Date - Apr 01 , 2026 | 01:49 AM