Share News

చిత్తూరు అబ్బాయి ...అమెరికా అమ్మాయి

ABN , Publish Date - Feb 21 , 2026 | 12:14 AM

మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. రెండువైపులా తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లూ పెళ్లికి అంగీకరించారు

చిత్తూరు అబ్బాయి ...అమెరికా అమ్మాయి
కాణిపాక వినాయకస్వామి ఆలయం వద్ద వధూవరులు

చిత్తూరు అర్బన్‌, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): అబ్బాయి చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన కిషన్‌ కిరణ్‌ తోమాల. అమెరికాలోని టెక్సా్‌సలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు. అమ్మాయి మియా సమంతా హెర్నాండెజ్‌. ఈమెది టెక్సాస్‌. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నారు. రెండువైపులా తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్లూ పెళ్లికి అంగీకరించారు. ఆరు నెలల క్రితం అమెరికాలో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు వైష్ణవ సంప్రదాయం ప్రకారం చిత్తూరులో వీరి పెళ్లి జరిగింది. పెళ్లి కుమార్తె, ఆమె తల్లిదండ్రులతో పాటు చెల్లెలు, స్నేహితులు వారం కిందటే ఇక్కడికి వచ్చారు. చిత్తూరు సమీపంలోని రిసార్ట్స్‌లో మూడు రోజులపాటు మెహందీ, సంగీత్‌, పండరి పూజ, పసుపు దంచడం, హల్లి తదితర కార్యక్రమాలతో వివాహం జరిగింది. కాగా, అబ్బాయి తల్లిదండ్రులు పూజారి రెడ్డి మురళీధర్‌, గీతా గాయత్రి చిత్తూరులో ప్రభుత్వ ఉపాధ్యాయులు. వీరికి ఇద్దరు కుమారులు. వారి చదువుల కోసం తమ ఉద్యోగాలను వదిలి అమెరికా వెళ్లారు. పెద్ద కుమారుడు కిషన్‌ కిరణ్‌తోమాల సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికాగా.. చిన్న కుమారుడు అక్కడే అమెజాన్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అక్కడే వీరి కుటుంబం స్థిరపడిది. మురళీధర్‌ తల్లిదండ్రులు చిత్తూరులో ఉండేవారు. రె ండేళ్ల కిందట అతడి తల్లి చనిపోయింది. తండ్రి ఒక్కరే కావడంతో.. మురళీధర్‌ దంపతులు చిత్తూరుకు వచ్చేశారు. పెళ్లి కుమార్తె కుటుంబీకులను ఒప్పించి తమ పెద్ద కుమారుడి పెళ్లిని చిత్తూరులో జరిపించారు.

Updated Date - Feb 21 , 2026 | 12:14 AM