Share News

డీయూ వీసీగా చిన్న మల్లయ్య

ABN , Publish Date - Mar 14 , 2026 | 01:05 AM

కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయానికి కొత్త వైస్‌ చాన్సలర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో డెవల్‌పమెంట్‌ ఎకనామిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చిన్న మల్లయ్య లక్కినేనిని వీసీగా నియమించారు.

డీయూ వీసీగా చిన్న మల్లయ్య

కుప్పం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయానికి కొత్త వైస్‌ చాన్సలర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ విశ్వవిద్యాలయంలో డెవల్‌పమెంట్‌ ఎకనామిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న చిన్న మల్లయ్య లక్కినేనిని వీసీగా నియమించారు. ఈయన పదవీకాలం మూడు సంవత్సరాలు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయ చట్టం-1997 ప్రకారం గవర్నర్‌, విశ్వవిద్యాలయ చాన్సలర్‌ అయిన ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈ నియామకాన్ని ఆమోదించారు. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ జీవో ఎంఎస్‌ నం.6ను విడుదల చేసింది. నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌ గెజిట్‌లో ప్రచురించనున్నారు.

Updated Date - Mar 14 , 2026 | 01:05 AM