Share News

చినమాంగోడు విధ్వంసం కేసు తుది విచారణ మొదలు

ABN , Publish Date - Jul 09 , 2026 | 01:32 AM

తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కోర్టులో నడుస్తున్న చినమాంగోడు విధ్వంసం కేసు తుది విచారణ బుధవారం మొదలైంది. ఈరోజు నుంచి రోజువారీ విచారణ జరుపుతున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.

చినమాంగోడు విధ్వంసం కేసు తుది విచారణ మొదలు

తడ, జూలై 8(ఆంధ్రజ్యోతి):తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా కోర్టులో నడుస్తున్న చినమాంగోడు విధ్వంసం కేసు తుది విచారణ బుధవారం మొదలైంది. ఈరోజు నుంచి రోజువారీ విచారణ జరుపుతున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. రెండు నెలల్లో తుది తీర్పు వెలువరించే ఆస్కారం ఉన్నట్లు మత్స్యకారులు భావిస్తున్నారు. మరోవైపు ఆంధ్రజ్యోతిలో ఈ కేసు గురించి బుధవారం ప్రచురితమైన కథనంతో అధికారుల్లో సైతం కొంత చలనం వచ్చింది. మత్స్యకారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. అలాగే ఆంధ్రా మత్స్యకారులు రాజీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా గురు, శుక్రవారంల్లో మత్స్యకార గ్రామాల పెద్దలతో మత్స్యకార నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు.

Updated Date - Jul 09 , 2026 | 01:32 AM