Share News

ఉద్యోగం పేరుతో మోసం

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:51 AM

తమ కుమారుడికి బహుళజాతి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.2.70లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ బాధిత తల్లిదండ్రులు సోమవారం ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేశారు.

ఉద్యోగం పేరుతో మోసం
ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితుడి తల్లిదండ్రులు

మదనపల్లె క్రైం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): తమ కుమారుడికి బహుళజాతి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి రూ.2.70లక్షలు తీసుకుని మోసం చేశాడంటూ బాధిత తల్లిదండ్రులు సోమవారం ఎస్పీ ధీరజ్‌కు ఫిర్యాదు చేశారు. పీలేరుకు చెందిన మస్తాన్‌సాహెబ్‌, ఆరీపూన్‌ దంపతుల కుమారుడు అబ్దుల్‌వాహిద్‌ బీటెక్‌ పూర్తిచేసి ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు. కొన్ని రోజుల కిందట తిరుపతికి చెందిన లోకేశ్‌తో పరిచయమైంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో హిటాచీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి రూ.2.70 లక్షలు తీసుకున్నాడు. ఎన్నాళ్లయినా ఉద్యోగం ఇప్పించకపోగా ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అతడు మోసగాడని తెలిసింది. దీంతో బాధితులు ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అతనిపై చర్యలు తీసుకుని, తమ డబ్బు రికవరీ చేసివ్వాలని కోరారు. తమతోపాటు శ్రీకాళహస్తికి చెందిన సాయిలిఖిత్‌ అనే యువకుడిని నమ్మించి రూ.2.50లక్షలు తీసుకున్నాడని తెలిపారు.

Updated Date - Jul 14 , 2026 | 01:51 AM