Share News

మారింది బొమ్మే!

ABN , Publish Date - Jan 04 , 2026 | 03:09 AM

కొత్త పట్టాదారుపాసు పుస్తకాలపై చాలామంది రైతులు పెదవి విరుస్తున్నారు. తప్పులను సరిచేయకుండా పంపిణీ చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పట్టాదారు పాసుపుస్తకంపైన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మ ఉండేది. చాలా వరకూ వివరాలు కూడా తప్పుల తడకగా ఉండేవి. దీంతో అప్పట్లో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాజముద్రతో పాసు పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంది. పాత వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా అఽధునాతన సాంకేతికత సాయంతో భూవివాదాలకు చెక్‌ పెట్టాలని సంకల్పించింది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కొత్త పాసు పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రైతుల మీద భారం పడకుండా రాష్ట్రప్రభుత్వమే వ్యయాన్ని భరించింది. జగన్‌రెడ్డి బొమ్మను తొలగించి రాజముద్ర వేసి రంగుమార్చింది. అయితే వీటిని అందుకుంటున్న రైతుల్లో ఆనందం వ్యక్తం కావడంలేదు. పాత సమస్యలను దిద్దకుండా అట్టహాసంగా పంపిణీ చేస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. దీనివల్ల ప్రభుత్వ ఉదాత్త లక్ష్యం నీరుగారిపోతోంది. దీనికితోడు తప్పులు సరిదిద్దుకోవడానికి రైతులే చలానా చెల్లించాలని అధికారులు చెబుతుండటంతో విమర్శలు వినిపిస్తున్నాయి.

మారింది బొమ్మే!
తప్పుల తడకగా కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు

  • పట్టాదారు పుస్తకాలపై రైతుల అసంతృప్తి

  • జగన్‌ బొమ్మ తీసేసినా సరిచేయని తప్పులు

  • అధికారుల తప్పిదాలతో నీరుగారుతున్న లక్ష్యం

(అన్నమయ్య-ఆంధ్రజ్యోతి)

కొత్త పట్టాదారుపాసు పుస్తకాలపై చాలామంది రైతులు పెదవి విరుస్తున్నారు. తప్పులను సరిచేయకుండా పంపిణీ చేస్తున్నారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో పట్టాదారు పాసుపుస్తకంపైన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బొమ్మ ఉండేది. చాలా వరకూ వివరాలు కూడా తప్పుల తడకగా ఉండేవి. దీంతో అప్పట్లో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రాజముద్రతో పాసు పుస్తకాలు అందించేందుకు చర్యలు తీసుకుంది. పాత వాటి స్థానంలో కొత్తవి ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా అఽధునాతన సాంకేతికత సాయంతో భూవివాదాలకు చెక్‌ పెట్టాలని సంకల్పించింది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కొత్త పాసు పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రైతుల మీద భారం పడకుండా రాష్ట్రప్రభుత్వమే వ్యయాన్ని భరించింది. జగన్‌రెడ్డి బొమ్మను తొలగించి రాజముద్ర వేసి రంగుమార్చింది. అయితే వీటిని అందుకుంటున్న రైతుల్లో ఆనందం వ్యక్తం కావడంలేదు. పాత సమస్యలను దిద్దకుండా అట్టహాసంగా పంపిణీ చేస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. దీనివల్ల ప్రభుత్వ ఉదాత్త లక్ష్యం నీరుగారిపోతోంది. దీనికితోడు తప్పులు సరిదిద్దుకోవడానికి రైతులే చలానా చెల్లించాలని అధికారులు చెబుతుండటంతో విమర్శలు వినిపిస్తున్నాయి.

అప్‌డేట్‌ కాని వివరాలు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రీ-సర్వే చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చారు. వీటిలో లబ్ధిదారుల, తండ్రి,భర్త పేర్లలో తప్పులు దొర్లాయి. సర్వేనంబరు, విస్తీర్ణం, గ్రామం పేర్లల్లోనూ అదే తీరు కనిపించింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పాసుపుస్తకాల్లోనూ ఇలాంటి తప్పులుంటున్నాయి. రీ సర్వే జరిగిన గ్రామాల్లో జాయింట్‌ ఎల్పీఎం కారణంగా విడివిడిగా అడంగల్‌ రావడం లేదు. మ్యుటేషన్లు ఆమోదించినా ఖాతాల్లోకి ఆ మేరకు భూవివరాలు అప్‌డేట్‌ కాలేదు. ఇప్పుడు ఇదే ప్రధాన సమస్యగా మారింది. అనేకసార్లు ఫిర్యాదులు తీసుకున్నా చాలావరకు సరిదిద్దలేదని రైతులు అంటున్నారు.

.

రాజముద్రతో ..అవే తప్పులతో..

తాజా పుస్తకాలలో తప్పులున్నాయనడానికీ లేదు. ఎందుకంటే... ఆ వివరాలన్నీ పాతవే.. కొత్త పాసుపుస్తకాలను ఈ ఏడాది జూన్‌, మేలో అచ్చు వేశారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వస్తున్న వన్‌బీ మేరకు వివరాలు అప్డేట్‌ కాలేదు. తండ్రి , భర్త పేర్ల తప్పులు, విస్తీర్ణంలో తేడాలు, సర్వేనంబర్ల మిస్సింగ్‌పై రైతులు ప్రశ్నిస్తే.. మీరు మళ్ళీ మ్యుటేషన్‌కు కట్టండి.. సరి చేస్తామంటూ రెవెన్యూ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఉదాహరణకు తంబళ్ళపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్ట పంచాయతీ కొత్తపల్లికి చెందిన మహిళా రైతు బి.రెడ్డెమ్మకు గోళ్ళపల్లిలో భూమి ఉంది. ఈ భూమి రికార్డుల్లో భర్త పేరు చౌడప్పగా మార్పు కోసం ఆమె దరఖాస్తు చేసింది. ఆన్‌లైన్‌1బిలో కూడా మార్పు చేసినా తాజా పాసు పుస్తకంలో మారలేదు. పాతవివరాలతో కొత్తపుస్తకం ఇచ్చారు.

వారి తప్పులకు మేం చలానా కటాలా?

రెవెన్యూ గ్రామసభల్లో రీ-సర్వే అనంతరం ఇస్తున్న పట్టాదారుపాసుపుస్తకాలు తప్పుల తడకగా మారాయి. రూ. 50 చలానా కడితే తప్పులు సరిచేస్తామన్న అఽధికారులు ఇప్పుడేమో రూ. 550 చలానా కడితేనే సబ్‌ డివిజన్‌చేస్తామని చె ప్తున్నారు. సర్వేనంబరు 981/2లో 77 సెంట్ల భూమిని ఎల్లుల వెంకటరమణారెడ్డి పేరు మీద పాసుపుస్తకం ఇచ్చారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పునకు మేమెందుకు చలానా కట్టాలి?

- శివకుమార్‌, కంభంమిట్ట. పీలేరు

భూమి విస్తీర్ణం తగ్గించేశారు

పుంగనూరు మండలం మంగళం పంచాయతీ చెలిమిగడ్డలో సర్వేనంబరు 172/2లో మాకు 32.50 సెంట్ల భూమి ఉంది. రీ సర్వే చేసిన అధికారులు ఇందులో రెండన్నర సెంట్లు తగ్గించేశారు. 30సెంట్లకు కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చారు. మాకు ఎకరా భూమి కూడా లేదు. ఫక్కా సెటిల్మెంట్‌ భూమికి అన్ని రికార్డులు ఉన్నప్పటికీ..రెవెన్యూ అధికారులు మాకు అన్యాయం చేశారు. అధికారులు మాకు న్యాయం చేయాలి

-టి.రాజేశ్వరి, మంగళం, పుంగనూరు మండలం

నా పేరు మీద ఇస్తే బాగుండేది:

మాది కలకడ మండలం నడిమిచర్ల. నా భర్త పటాన్‌ మౌలాఖాన్‌ మూడేళ్ళ క్రితం చనిపోయాడు. మాదినేనిపాలెం రెవెన్యూ గ్రామంలో ఖాతానంబరు 166తో ఆయన పేరుమీద గతంలో పట్టాదారు పాసుపుస్తకం మంజూరైుంది. ఇప్పుడు నా భర్త పేరు మీద కొత్తపాసుపుస్తకం ఇచ్చారు. నాపేరు మీద ఇచ్చుంటే రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ తప్పేది.

-పటాన్‌ మదార్‌భీ. కలకడ

ఆధార్‌ నంబరు తప్పుగా ఉంది

మాది మర్రిమాకులపల్లె, సర్వేనంబరు 19/15లో 1.33ఎకరాల భూమి ఉంది. పాసుపుస్తకం ఉంది. వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పాసుపుస్తకాన్ని తీసుకుని కొత్తది ఇచ్చారు. ఇందులో నా ఆధార్‌నంబరు 929207279357కు బదులుగా 4049601194నంబరు పడింది. దీనిని సరి చేసుకోవడానికి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ ఎన్నిరోజులు తిరగాల్సి వస్తుందో..?

-బుక్కే లక్ష్మణ్‌నాయక్‌, మర్రిమాకులపల్లె,

Updated Date - Jan 04 , 2026 | 03:09 AM