బెంగళూరు ప్లాట్‌ఫామ్‌ల మార్పు
ABN , Publish Date - Jun 04 , 2026 | 01:18 AM
విపరీతంగా ఏర్పడుతున్న రద్దీ దృష్ట్యా తిరుపతి సెంట్రల్ బస్సుస్టేషన్‌లో బెంగళూరు ప్లాట్‌ఫామ్‌లను మార్చేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీనివాస బస్టాండులోని బెంగళూరు నాలుగు ప్లాట్‌ఫామ్‌ల వద్ద స్థలాభావం కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తిరుపతి అర్బన్, జూన్ 3(ఆంధ్రజ్యోతి): విపరీతంగా ఏర్పడుతున్న రద్దీ దృష్ట్యా తిరుపతి సెంట్రల్ బస్సుస్టేషన్‌లో బెంగళూరు ప్లాట్‌ఫామ్‌లను మార్చేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీనివాస బస్టాండులోని బెంగళూరు నాలుగు ప్లాట్‌ఫామ్‌ల వద్ద స్థలాభావం కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై బుధవారం ఉదయం డీపీటీఈ జగదీష్, డిప్యూటీ సీటీఎం విశ్వనాథం, ఇతర అధికారులు కలసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. సాధ్యాసాధ్యాలను చర్చించి చివరగా విశాల స్థలమున్న 26, 27, 28, 29 ప్లాట్‌ఫామ్‌లకు బెంగళూరు బస్సులు, ఇక్కడ ఆగుతున్న బస్సులు చిత్తూరు-21, పలమనేరు, కుప్పం, కృష్ణగిరి-22, తిరువణ్ణామలై, తిరుచ్చి, మధురై-23, తిరువణ్ణామలై, వేలూరు-24 ప్లాట్‌ఫామ్‌లకు మార్పుచేస్తూ నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలను తమిళనాడు, కర్ణాటక ఆర్టీసీ యాజమాన్యాలతో చర్చించి త్వరలో అమలు చేయడానికి కసరత్తు చేస్తున్నారు.