Share News

చంద్రగిరి @ 752 అర్జీలు

ABN , Publish Date - Jan 09 , 2026 | 01:14 AM

భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘రెవెన్యూ క్లినిక్‌’ తీసుకొచ్చింది. పీజీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా ఏర్పాటు చేసింది. జిల్లాలో తొలిసారిగా గురువారం చంద్రగిరి నియోజకవర్గంతో ఈ కార్యక్రమం మొదలైంది. వివిధ భూ సమస్యలపై 752 అర్జీలు అందాయి. ఉదయం 9.30 గంటలకే నియోజకవర్గం నుంచి అర్జీదారులు బారులు తీరారు. దరఖాస్తులకోసం జనం ఎగబడటంతో వీటిని ఇచ్చేందుకు కలెక్టరేట్‌ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం నుంచి పీజీఆర్‌ఎస్‌ హాల్‌ వరకు భూసమస్యలపై వచ్చిన అర్జీదారులతో నిండిపోయింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్‌ రాత్రి 7.30గంటల వరకు సాగింది. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఇన్‌ఛార్జి జేసీ మౌర్య, డీఆర్వో నరసింహులు, ఎస్‌డీసీలు రోజ్మాండ్‌, దేవేంద్రరెడ్డి, ఆర్డీవో రామ్మోహన్‌, కలెక్టరేట్‌ సిబ్బంది, ఆయా మండలాల తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, వీఆర్వోలు అర్జీలు స్వీకరించారు. ఏ సమస్య ఎపుడు పరిష్కారం అవుతుంతో నిర్దిష్ట సమయం ఇచ్చారు. ప్రతి టేబుల్‌ వద్దకు వెళ్లి అర్జీదారులతో కలెక్టర్‌ మాట్లాడారు. వారి సమస్యలను విన్నారు. 20 మంది అర్జీదారులకు తక్షణ పరిష్కారం చూపారు. నియోజకవర్గంలోని 8మంది లబ్ధిదారుల (సుమారు 24ఎకరాలు) భూములను 22ఏ నుంచి తొలగించి అప్పటికప్పుడు వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఇంటిస్థలాలు కావాలని తిరుగుతున్న వారికి ఖాళీ లేఅవుట్లలో ఇంటిస్థలాల ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఇన్నేళ్ల సమస్య పరిష్కారం కావడంతో 20మంది లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేశారు. మిగతా వాటినీ ప్రాధాన్యక్రమంలో పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు.

చంద్రగిరి @ 752 అర్జీలు
అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌

- భూ సమస్యలపై పది గంటలపాటు సాగిన రెవెన్యూ క్లినిక్‌

  • అర్జీదారులతో కిక్కిరిసిన కలెక్టరేట్‌

  • 20 సమస్యలకు తక్షణ పరిష్కారం

  • వీఆర్వోను సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌

తిరుపతి(కలెక్టరేట్‌), జనవరి 8(ఆంధ్రజ్యోతి): భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘రెవెన్యూ క్లినిక్‌’ తీసుకొచ్చింది. పీజీఆర్‌ఎ్‌సకు అనుబంధంగా ఏర్పాటు చేసింది. జిల్లాలో తొలిసారిగా గురువారం చంద్రగిరి నియోజకవర్గంతో ఈ కార్యక్రమం మొదలైంది. వివిధ భూ సమస్యలపై 752 అర్జీలు అందాయి. ఉదయం 9.30 గంటలకే నియోజకవర్గం నుంచి అర్జీదారులు బారులు తీరారు. దరఖాస్తులకోసం జనం ఎగబడటంతో వీటిని ఇచ్చేందుకు కలెక్టరేట్‌ సిబ్బంది ఇబ్బంది పడ్డారు. కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం నుంచి పీజీఆర్‌ఎస్‌ హాల్‌ వరకు భూసమస్యలపై వచ్చిన అర్జీదారులతో నిండిపోయింది. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన రెవెన్యూ క్లినిక్‌ రాత్రి 7.30గంటల వరకు సాగింది. కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఇన్‌ఛార్జి జేసీ మౌర్య, డీఆర్వో నరసింహులు, ఎస్‌డీసీలు రోజ్మాండ్‌, దేవేంద్రరెడ్డి, ఆర్డీవో రామ్మోహన్‌, కలెక్టరేట్‌ సిబ్బంది, ఆయా మండలాల తహసీల్దార్లు, డీటీలు, ఆర్‌ఐలు, వీఆర్వోలు అర్జీలు స్వీకరించారు. ఏ సమస్య ఎపుడు పరిష్కారం అవుతుంతో నిర్దిష్ట సమయం ఇచ్చారు. ప్రతి టేబుల్‌ వద్దకు వెళ్లి అర్జీదారులతో కలెక్టర్‌ మాట్లాడారు. వారి సమస్యలను విన్నారు. 20 మంది అర్జీదారులకు తక్షణ పరిష్కారం చూపారు. నియోజకవర్గంలోని 8మంది లబ్ధిదారుల (సుమారు 24ఎకరాలు) భూములను 22ఏ నుంచి తొలగించి అప్పటికప్పుడు వారికి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఇంటిస్థలాలు కావాలని తిరుగుతున్న వారికి ఖాళీ లేఅవుట్లలో ఇంటిస్థలాల ధ్రువీకరణ పత్రాలు అందించారు. ఇన్నేళ్ల సమస్య పరిష్కారం కావడంతో 20మంది లబ్ధిదారులు ఆనందం వ్యక్తంచేశారు. మిగతా వాటినీ ప్రాధాన్యక్రమంలో పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు.

తప్పుడు నివేదిక ఇచ్చిన వీఆర్వో సస్పెన్షన్‌

వేరే వారి పేరుతో భూములను రిజిస్టర్‌ చేసి కట్టబెట్టారంటూ రెవెన్యూ క్లినిక్‌లో రామచంద్రాపురం మండలం పీవీపురానికి లక్ష్మీపతి వీఆర్వోపై ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సంజీవరాయపురానికి చెందిన శంకర్‌రెడ్డికి అనుభవం లేకున్నా డీకేటీ పట్టా ఇచ్చినట్లు వెల్లడైంది. దీంతో గంగిరెడ్డిపల్లికి చెందిన వీఆర్వో గుణభూషణనాయుడిపై అక్కడికక్కడే కలెక్టర్‌ విచారించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా తప్పుడు నివేదికలిచ్చిన ఆ వీఆర్వోను అక్కడికక్కడే సస్పెండ్‌ చేశారు.

సులువుగా పరిష్కారం

జిల్లాలో గత 18 నెలల్లో 38 వేల అర్జీలు అందాయి. వీటిని తక్షణం పరిష్కరించడం గగనంగా మారింది. ఒక్కో నియోజకవర్గానికి ఒకరోజు కేటాయించడంతో రికార్డుల సహా అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం చాలా సులువుగా మారింది.

- కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

ఉదయం అర్జీ.. సాయంత్రానికి పరిష్కారం

మా భూమిని 22ఏ నిషేధిత జాబితాలో పెట్టారు. దీనిని తొలగించాలని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ఎన్నో ఏళ్లుగా తిరిగి అలసిపోయాను. రెవెన్యూ క్లినిక్‌లో ఉదయం అర్జీ ఇవ్వగానే.. సాయంత్రానికంతా ఆ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించామంటూ కలెక్టర్‌ ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్‌తో ఏళ్ల సమస్యను గంటల్లో పరిష్కరించడం ఆనందంగా ఉంది.

- వెంకటసుబ్బారావు, మొగరాల, పాకాల మండలం

ఇది ఊహంచలేదు

నిషేధిత జాబితా నుంచి మా భూమిని తొలగించమని ఎన్నో సార్లు అర్జీలిచ్చా. కాలయాపన తప్ప పరిష్కారం లభించలేదు. రెవెన్యూ క్లినిక్‌లో ఉదయం అర్జీ ఇస్తే సాయంత్రం పిలిచి 22ఏనుంచి భూమిని తొలగించామని ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. ఇది నేను ఊహించలేకపోయా.

- మోహన్‌రెడ్డి, చిన్నగొట్టిగల్లు మండలం

Updated Date - Jan 09 , 2026 | 01:14 AM