మామిడి రైతులకు కేంద్రం చేయూత
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:17 AM
తోతాపురి రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహకం పకటించిన విషయం తెలిసిందే.
చిత్తూరు సెంట్రల్, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తోతాపురి రైతులకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.4 ప్రోత్సాహకం పకటించిన విషయం తెలిసిందే. తమ వంతు సాయం చేయాలని సీఎం చంద్రబాబు ఇటీవల రాసిన లేఖపై కేంద్రం తాజాగా స్పందించింది. గతేడాది కూడా కేంద్రం కిలోకు రూ.1.86 చొప్పున అందించింది. ఈసారి కిలోకు రూ.2.18 చొప్పున అందించనున్నట్లు ప్రకటించింది. గతేడాది తరహాలో రైతుకు కిలో మీద రూ.4 ప్రోత్సాహకమే అందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. టన్నుకు రూ.17,470గా మద్దతు ధరను కేంద్రం ప్రకటించింది. రైతు మార్కెట్‌లో కాయల్ని ఎంతకు అమ్ముకున్నా కేంద్రం మాత్రం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 25 శాతమే (రూ.4.36) ఇస్తుంది. అంటే రూ.4.36లో సగం రూ.2.18 మాత్రమే కేంద్రం నుంచి లభిస్తుంది. మార్కెట్ ఇంట్రవెన్షన్ స్కీం (ఎంఐఎస్) ద్వారా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ (పీడీపీ) కింద కేంద్రం దీన్ని ప్రకటించింది.