1నుంచి తిరుత్తణి గుడిలో సెల్‌ఫోన్లు, కెమెరాలు నిషేధం
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:41 AM
జిల్లా సరిహద్దు.. తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయంలో సెప్టెంబరు ఒకటో తేది నుంచి సెల్‌ఫోన్లు, కెమెరాలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
నగరి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా సరిహద్దు.. తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణి సుబ్రమణ్యస్వామి ఆలయంలో సెప్టెంబరు ఒకటో తేది నుంచి సెల్‌ఫోన్లు, కెమెరాలను నిషేధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో సెల్‌ఫోన్లు, కెమెరాలను తీసుకెళ్లడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన క్రమంలో తిరుత్తణిలోనూ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులు తమ సెల్‌ఫోన్లను, కెమెరాలను ఆలయం బయట భద్రపరిచేలా ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రూ.5 చెల్లించి టోకెన్లు పొందవచ్చన్నారు. జిల్లా నుంచి తరచూ అధిక సంఖ్యలో భక్తులు తిరుత్తణి సుబ్రమణ్యస్వామి దర్శనానికి వెళుతుంటారు.