Share News

మండీలో సంబరాలు

ABN , Publish Date - Jun 19 , 2026 | 01:10 AM

కిలో తోతాపురికి రూ.4 సబ్సిడీ ప్రకటన రాగానే.. రైతుల్లో ఆనందం నెలకొంది. ఎమ్మెల్యే మురళీమోహన్‌, మండల పార్టీ అధ్యక్షుడు ఎన్పీ ధరణీప్రసాద్‌ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌ యార్డుకు చేరుకున్నారు. బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. మామిడి రైతుల దేవుడు.. చంద్రబాబునాయుడు అంటూ నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటాలతో మామిడి మండీల్లోకి వెళ్లి హర్షం వ్యక్తంచేశారు.

మండీలో సంబరాలు

బంగారుపాళ్యం, ఆంధ్రజ్యోతి: కిలో తోతాపురికి రూ.4 సబ్సిడీ ప్రకటన రాగానే.. రైతుల్లో ఆనందం నెలకొంది. ఎమ్మెల్యే మురళీమోహన్‌, మండల పార్టీ అధ్యక్షుడు ఎన్పీ ధరణీప్రసాద్‌ ఆధ్వర్యంలో నాయకులు, రైతులు బంగారుపాళ్యం మామిడి మార్కెట్‌ యార్డుకు చేరుకున్నారు. బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. మామిడి రైతుల దేవుడు.. చంద్రబాబునాయుడు అంటూ నినాదాలు చేశారు. సీఎం చంద్రబాబు చిత్రపటాలతో మామిడి మండీల్లోకి వెళ్లి హర్షం వ్యక్తంచేశారు. మామిడి రైతులకు సబ్సిడీ ఇచ్చి ఆదుకున్న ఏకైక సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే మురళీమోహన్‌ పేర్కొన్నారు. గతేడాది బంగారుపాళ్యం మండలంలోని రైతులకు రూ.90 కోట్ల సబ్సిడీ వచ్చిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ భాస్కర్‌నాయుడు, టీడీపీ మాజీ మండలాధ్యక్షుడు ఎన్పీ జయప్రకాష్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు హేమచంద్రనాయుడు, నాయకులు కోకా ప్రకా్‌షనాయుడు, జనార్దన్‌గౌడ్‌, కమలనాథరెడ్డి, మధుసూదన్‌నాయుడు, లోకనాథనాయుడు, బీసీ రవీంద్రనాయుడు, ఆరీఫ్‌ బాషా, రాధాక్రిష్ణమనాయుడు, శివతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 01:11 AM