Share News

ఓటర్లకు పంచేందుకు వైసీపీ తరలిస్తున్న నగదు స్వాధీనం

ABN , Publish Date - Oct 30 , 2026 | 01:22 AM

మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎంసీసీ బృందం నాయుడుపేటకు అన్ని మూలలా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.

  ఓటర్లకు పంచేందుకు వైసీపీ తరలిస్తున్న నగదు స్వాధీనం

ముగ్గురిపై కేసు నమోదు

నాయుడుపేట టౌన్‌,అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఎంసీసీ బృందం నాయుడుపేటకు అన్ని మూలలా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పట్టణంలోకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ వర్గీయులు ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్నారు.నాయుడుపేటలోని అమరావతి సెంటర్‌ వద్ద బుధవారం రాత్రి ఎంసీసీ బృందం తనిఖీలు చేపట్టింది.ఓ కారులో ముగ్గురు వైసీపీ వర్గీయులు తరలిస్తున్న రూ.1.10,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.వైసీపీ నాయకుడు విజియల్‌రెడ్డితో పాటు ఇద్దరు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.వారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కారులో వున్న ఓటరు జాబితా పత్రాలు, బ్యాలెట్‌ పేపర్‌ నమూనాలు, వైసీపీ కండువాలు, జెండాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Oct 30 , 2026 | 01:22 AM