Share News

ఊరించి.. ఉసూరుమనిపించి

ABN , Publish Date - Apr 30 , 2026 | 01:46 AM

పలమనేరు మార్కెట్‌లో టమోటా ధరలు పెరిగినట్లే పెరిగి మూడు రోజుల వ్యవధిలో గణనీయంగా పడిపోయాయి. పది రోజుల కిందట 15 కిలోల బాక్సు ధర రూ.550 వరకు పలికింది. ఐదు రోజులు సుమారుగా అదే ధర కొనసాగింది.

ఊరించి.. ఉసూరుమనిపించి

పలమనేరు మార్కెట్‌లో టమోటా ధరలు పెరిగినట్లే పెరిగి మూడు రోజుల వ్యవధిలో గణనీయంగా పడిపోయాయి. పది రోజుల కిందట 15 కిలోల బాక్సు ధర రూ.550 వరకు పలికింది. ఐదు రోజులు సుమారుగా అదే ధర కొనసాగింది. ఆదివారం బాక్సు ధర రూ.500 పలకగా, సోమవారం రూ.450, మంగళవారం రూ.400, బుధవారం రూ.350కి పడిపోయింది. ధరలు పెరుగుతుండటంతో ఈసారి అప్పులు తీరిపోతాయని భావించిన టమోటా రైతులు, నిరాశ చెందారు. కనీసం ఇదే ధర కొనసాగినా నష్టం రాదని అంటున్నారు.

- పలమనేరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Apr 30 , 2026 | 01:46 AM