Share News

ప్రశాంతంగా నీట్‌

ABN , Publish Date - May 04 , 2026 | 01:51 AM

చిత్తూరులోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నీట్‌ ప్రశాంతంగా జరిగింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎ్‌స వంటి మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నేషనల్‌ ఎలిజిబులిటీ కం ఎంట్రన్స్‌ టెస్టు (నీట్‌) నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. వీరిని ఆయా సెంటర్లలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు సిబ్బంది క్షుణ్నంగా తనిఖీలు చేసి, పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు.

ప్రశాంతంగా నీట్‌
లిటిల్‌ ఫ్లవర్‌ స్కూల్‌ సెంటర్‌ వద్ద విద్యార్థులు

చిత్తూరు సెంట్రల్‌, ఆంధ్రజ్యోతి: చిత్తూరులోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఆదివారం నీట్‌ ప్రశాంతంగా జరిగింది. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎ్‌స వంటి మెడికల్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో ప్రవేశానికి నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో నేషనల్‌ ఎలిజిబులిటీ కం ఎంట్రన్స్‌ టెస్టు (నీట్‌) నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. వీరిని ఆయా సెంటర్లలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంట వరకు సిబ్బంది క్షుణ్నంగా తనిఖీలు చేసి, పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. ప్రతి సెంటర్‌లోనూ విద్యార్థినులను ప్రత్యేకంగా తనిఖీలు చేయడంతో పాటు హెయిర్‌ క్లిప్పులు, ఆభరణాలు, చేతికి, కాలికి కట్టిన దారాలు తొలగింపచేశారు. సెల్‌ఫోన్ల డిపాజిట్‌కు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. వేసవి నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు వేచి ఉండేందుకు షామియానా వేసి తాగునీటి సౌకర్యం కల్పించారు. మూడు కేంద్రాల్లో మొత్తం 1060 మంది విద్యార్థులకు గాను 1020 మంది హాజరయ్యారు. 40 మంది పరీక్షలకు రాలేదని సిటీ కోఆర్డినేటర్‌ జీవనజ్యోతి తెలిపారు. పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 456 మందికి గాను 441, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాలలో 220కి 214 మంది, లిటిల్‌ ఫ్లవర్‌ ఇంగ్లీషు మీడియం స్కూల్లో 384కు 365 మంది హాజరయ్యారన్నారు. విద్యుత్తుకు అంతరాయం లేకుండా ఆయా సెంటర్లలో జనరేటర్లు ఏర్పాటు చేశారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో భద్రతను డీఎస్పీ వెంకటనారాయణ పర్యవేక్షించారు. టూటౌన్‌ సీఐ నెట్టికంఠయ్య, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - May 04 , 2026 | 01:51 AM