తమిళనాడు తగలకుండా పుత్తూరు నుంచి సత్యవేడుకు బైపాస్ రోడ్డు
ABN , Publish Date - Apr 14 , 2026 | 02:00 AM
మన రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు వెళ్లేందుకు పక్క రాష్ట్ర సరిహద్దుల నుంచి వెళ్లే పరిస్థితి తిరుపతి జిల్లాలో ఉంది. ఇటు పుత్తూరు నుంచి సత్యవేడు వెళ్లేందుకు తమిళనాడులోని ఊతుకోట మీదుగా వెళ్లాల్సి ఉంది. దీనివల్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తమిళనాడు ప్రాంతం తగలకుండా కొత్తగా ఒక రహదారి ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది.
రూ.135 కోట్లతో ఆర్‌అండ్‌బీ అధికారుల ప్రతిపాదనలు
తిరుపతి, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): మన రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు వెళ్లేందుకు పక్క రాష్ట్ర సరిహద్దుల నుంచి వెళ్లే పరిస్థితి తిరుపతి జిల్లాలో ఉంది. ఇటు పుత్తూరు నుంచి సత్యవేడు వెళ్లేందుకు తమిళనాడులోని ఊతుకోట మీదుగా వెళ్లాల్సి ఉంది. దీనివల్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తమిళనాడు ప్రాంతం తగలకుండా కొత్తగా ఒక రహదారి ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైంది.నారాయణవనం, నాగలాపురం ప్రాంతాల నుంచి సత్యవేడు వెళ్లేందుకు ఇప్పుడు ప్రధానంగా తమిళనాడులోని ఊతుకోట ఒక్కటే మార్గం. దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడుతున్నట్లు అక్కడి స్థానికులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఒక్కో సమయంలో వాహనాలు తమిళనాడు రిజిస్ర్టేషన్ లేకపోవడం వల్ల సమస్య ఏర్పడుతోందని ఆవేదన చెందుతున్నారు. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు కొత్త రహదారి నిర్మాణానికి సిద్ధమయ్యారు.సురుటుపల్లె వద్ద కారణి నుంచి దాసుకుప్పం వరకు సుమారు రూ.2.7 కి.మీ మేరకు బైపాస్ రోడ్డును వేసేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదించగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించారు. ఇందుకు సుమారు రూ.36 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇక్కడ రహదారి నిర్మాణానికి భూసేకరణ సమస్య కూడా లేదని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అలాగే శ్రీకాళహస్తి నుంచి తడ వెళ్లే రహదారి పరిస్థితి సైతం ఆధ్వానంగా ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని సైతం అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 46 కి.మీ పరిధిలోని రహదారిని డబుల్ లేన్ పేవ్డ్ షోల్డర్స్ కింద పనులు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. రహదారి నిర్మాణానికి సుమారు రూ.99 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. పీపీపీ విఽధానంలో దీన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.శ్రీకాళహస్తి ప్రాంతం నుంచి శ్రీసిటీకి సులువుగా వెళ్లేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది.