Share News

వ్యాపార కేంద్రాలు జనసంద్రం

ABN , Publish Date - Mar 19 , 2026 | 02:31 AM

ఉగాది పండుగ సందర్భంగా మదనపల్లె పట్టణంలోని వ్యాపార కేంద్రాలు జనసంద్రంగా మారింది. పండుగకు కావాల్సిన వస్తువులు కోనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పూలు, బట్టల దుకాణాల్లో రద్దీ కనిపించింది.

వ్యాపార కేంద్రాలు జనసంద్రం
బెంగళూరు బస్టాండ్‌లో పూలు కోనుగోలు చేస్తున్న జనం ఉగాది సందడి

ఆకాశాన్నంటిన పూలు, పండ్ల ధరలు

మదనపల్లె అర్బన్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): ఉగాది పండుగ సందర్భంగా మదనపల్లె పట్టణంలోని వ్యాపార కేంద్రాలు జనసంద్రంగా మారింది. పండుగకు కావాల్సిన వస్తువులు కోనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పూలు, బట్టల దుకాణాల్లో రద్దీ కనిపించింది. ఆర్టీసీ బస్టాండ్‌, చిత్తూరు బస్టాండ్‌, బెంగళూరు బస్టాండ్‌ కూడళ్లలో కొనుగోలుదారుల సందడి కనిపించింది. ఆర్‌ఆర్‌ వీధి, నెహ్రూ బజార్‌లో, సీటీఎం రోడ్డులో, నీరుగట్టువారిపల్లెలో వస్త్రాల దుకాణాలు జనంతో కిటకిటలాడాయి. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ వీధి రద్దీగా ఉంది. ట్రాఫిక్‌ సమస్యతో ఇబ్బందులు పడాల్సి వచ్చింది. బెంగళూరు బస్టాండ్‌లోని పూల దుకాణాల్లోనూ సందడి కనిపించింది. కాగా, పూల ధరలు ఆకాశాన్ని అంటాయి. కనకాంబరాలు కిలో రూ.వెయ్యి, బంతిపూలు రూ.500, బటన్‌ రోజాలు రూ.300, చామంతులు రూ.200, సన్నమొగ్గలు రూ.300, మల్లెలు మొగ్గలు కిలో రూ.600 పలికాయి. అరటి పండ్లు డజను రూ.వంద పలికాయి.

Updated Date - Mar 19 , 2026 | 02:31 AM