కోడెద్దుల జోరు
ABN , Publish Date - Jan 22 , 2026 | 02:45 AM
చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో బుధవారం నిర్వహించిన జల్లికట్టుతో గ్రామం జనసంద్రమైంది.. కోడెద్దులు రంకెలేస్తూ జోరుగా పరుగులు తీయగా వాటిని నిలువరించేందుకు కుర్రాళ్ళు హుషారుగా ముందుకురికారు.ఉదయం గ్రామంలోని రైతులు గ్రామ దేవతకు పూజలు చేసి తమ కోడెగిత్తలకు కొమ్ములు చెలిగి రంగులు వేసి కొప్పులు తొడిగారు. రంగు కాగితాలు అంటించిన చెక్కపలకలను, రాజకీయ నాయకులు, సినీనటుల ఫొటోలతో కూడిన చెక్క పలకలను కొమ్ములకు కట్టి అందంగా అలంకరించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో యాదవ వీధిలో పశువులను గుంపులు, గుంపులుగా వదిలారు.జల్లికట్టుకు తరలి వచ్చిన యువకులు గుంపులుగా అల్లె అవతల నిలబడి కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీ పడ్డారు. కోడెగిత్తల కొమ్ములకు రంగు కాగితాలు అంటించిన చెక్కపలకలను, వస్తు సామాగ్రిని సొంతం చేసుకునే ప్రయత్నంలో కొంతమంది యువకులకు గాయాలయ్యాయి.మరికొంతమంది యువకుల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
కుర్రాళ్ల హుషారు
జల్లికట్టుతో జనసంద్రమైన ఎ.రంగంపేట
చంద్రగిరి, జనవరి 21(ఆంధ్రజ్యోతి):చంద్రగిరి మండలం ఎ.రంగంపేటలో బుధవారం నిర్వహించిన జల్లికట్టుతో గ్రామం జనసంద్రమైంది.. కోడెద్దులు రంకెలేస్తూ జోరుగా పరుగులు తీయగా వాటిని నిలువరించేందుకు కుర్రాళ్ళు హుషారుగా ముందుకురికారు.ఉదయం గ్రామంలోని రైతులు గ్రామ దేవతకు పూజలు చేసి తమ కోడెగిత్తలకు కొమ్ములు చెలిగి రంగులు వేసి కొప్పులు తొడిగారు. రంగు కాగితాలు అంటించిన చెక్కపలకలను, రాజకీయ నాయకులు, సినీనటుల ఫొటోలతో కూడిన చెక్క పలకలను కొమ్ములకు కట్టి అందంగా అలంకరించారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో యాదవ వీధిలో పశువులను గుంపులు, గుంపులుగా వదిలారు.జల్లికట్టుకు తరలి వచ్చిన యువకులు గుంపులుగా అల్లె అవతల నిలబడి కోడెగిత్తలను నిలువరించేందుకు పోటీ పడ్డారు. కోడెగిత్తల కొమ్ములకు రంగు కాగితాలు అంటించిన చెక్కపలకలను, వస్తు సామాగ్రిని సొంతం చేసుకునే ప్రయత్నంలో కొంతమంది యువకులకు గాయాలయ్యాయి.మరికొంతమంది యువకుల మద్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పశువులకు టీడీపీ జెండాలతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్,మంత్రి లోకేష్, ఎమ్మెల్యే నాని,తుడా ఛైర్మన్ దివాకర రెడ్డి ఫొటోలు కట్టి అల్లిలోకి వదిలారు.జల్లికట్టుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే నానికి గ్రామస్తులు,టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికి గ్రామంలో ఊరేగించారు. బుధవారం సాయంత్రం 3 గంటల వరకు జరిగిన జల్లికట్టుతో ఎ.రంగంపేట నుంచి నారావారిపల్లె మీదుగా వెళ్ళే రోడ్డు పూర్తిగా స్తంభించిపోయింది.జల్లికట్టు ముగిశాక జనమంతా ఒక్కసారిగా గ్రామం నుంచి బయటకు రావడంతో ఎ.రంగంపేట సర్కిల్లో అరగంట పాటు ట్రాఫిక్ స్తంభించిపోగా పోలీసులు వాహన రాకపోకలను క్రమబద్ధీకరించారు.