బుల్లెట్ బండి...నిబంధనలకు గండి!
ABN , Publish Date - Jul 14 , 2026 | 01:59 AM
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సామాన్య ప్రజలకు జరిమానాలు విధిస్తూ, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించే పోలీసు శాఖకు చెందిన ఓ అధికారి బుల్లెట్ బండి చర్చనీయాంశంగా మారింది.
తిరుపతి(నేరవిభాగం), జూలై 13(ఆంధ్రజ్యోతి): ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన సామాన్య ప్రజలకు జరిమానాలు విధిస్తూ, ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించే పోలీసు శాఖకు చెందిన ఓ అధికారి బుల్లెట్ బండి చర్చనీయాంశంగా మారింది. తిరుపతి నగరంలో విధుల్లో ఉన్న ఈ పోలీసు అధికారి హెల్మెట్ లేకుండానే బుల్లెట్ మోటార్ సైకిల్‌పై ప్రయాణిస్తున్న దృశ్యమిది. హెల్మెట్ లేకపోతే పోయేను... బైక్ నంబర్ ప్లేట్ మోటారు వాహనాల శాఖ నిబంధనలకు పూర్తి విరుద్దంగా కనిపిస్తోంది. ఇక బుల్లెట్ బండి సైలెన్సర్ కూడా కంపెనీ ఫిట్‌మెంట్ కాదేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల పేరిట సామాన్యుల పట్ల కఠినంగా వ్యవహరించే పోలీసు అధికారులు ఆ నిబంధనలను పాటించకపోవడం విడ్డూరంగా ఉంది.