Share News

తిరుపతి ఏఎస్పీ బాలచంద్రారెడ్డికి బ్రేక్‌

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:57 AM

తిరుపతి క్రైమ్‌ అదనపు ఎస్పీగా నియమించిన డి.బాలచంద్రారెడ్డి పోస్టింగ్‌ను రాష్ట్రప్రభుత్వం సవరించింది. తిరుపతిలో బాధ్యతలు స్వీకరించక ముందే ఆయన పోస్టింగ్‌ను రద్దు చేస్తూ మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

తిరుపతి ఏఎస్పీ బాలచంద్రారెడ్డికి బ్రేక్‌

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): తిరుపతి క్రైమ్‌ అదనపు ఎస్పీగా నియమించిన డి.బాలచంద్రారెడ్డి పోస్టింగ్‌ను రాష్ట్రప్రభుత్వం సవరించింది. తిరుపతిలో బాధ్యతలు స్వీకరించక ముందే ఆయన పోస్టింగ్‌ను రద్దు చేస్తూ మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 16న జారీ చేసిన జీఓ మేరకు ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న అదనపు ఎస్పీ(సివిల్‌) డి. బాలచంద్రారెడ్డిని తిరుపతి క్రైమ్‌ ఏఎస్పీగా ప్రభుత్వం నియమించింది. అయితే ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో గత జీఓలో పాక్షిక సవరణలు చేస్తూ ఆ పోస్టింగ్‌ను వెనక్కి తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రైతుల ఉద్యమ సమయంలో మంగళగిరి డీఎస్పీగా పనిచేసిన బాలచంద్రారెడ్డి రైతులను ఇబ్బందులకు గురిచేశారు. వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆయన వ్యవహరించిన తీరు అప్పట్లో విమర్శల పాలైంది. ఈ నేపథ్యంలో ఆయనను తిరుపతి క్రైమ్‌ ఏఎస్పీగా నియమించండం పట్ల విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన పోస్టింగును ప్రభుత్వం రద్దు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం డి. బాలచంద్రారెడ్డి మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది.

Updated Date - Jun 25 , 2026 | 12:57 AM