నారావారిపల్లె బస్సు యాత్రకు బ్రేక్
ABN , Publish Date - Jan 15 , 2026 | 02:09 AM
కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలన్న తమ డిమాండును సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లేందుకు నారావారిపల్లెకు చేట్టిన బస్సుయాత్రను ఎస్‌ఐ తేజస్విని అడ్డుకున్నారు.
వెదురుకుప్పం, జనవరి 14(ఆంధ్రజ్యోతి): కార్వేటినగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలన్న తమ డిమాండును సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లేందుకు నారావారిపల్లెకు చేట్టిన బస్సుయాత్రను ఎస్‌ఐ తేజస్విని అడ్డుకున్నారు. కార్వేటినగరంలో 15 రోజులుగా సామాజిక కార్యకర్త ప్రసాద్, ఉసురుపాటి పద్మనాభం తదితరులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో తమ ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని టీడీపీ నాయకులు రవికుమార్, వాసుదేవరెడ్డి తదితరులతో కలిసి బస్సులో నారావారిపల్లెకు కార్వేటినగరం నుంచి బయల్దేరారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ హనుమంతప్ప, ఎస్‌ఐ తేజస్విని అక్కడికి చేరుకుని బస్సులో జనం వెళ్లడానికి అనుమతిలేదని, అపాయింట్‌మెంట్ ఇచ్చిన ఇద్దరు మాత్రం వెళ్లవచ్చని తెలపడంతో బస్సు యాత్రకు బ్రేక్ పడింది.పోలీసుల తీరు ఆక్షేపనీయమని టీడీపీ నాయకుడు, కార్వేటినగరం మాజీ వైస్ ఎంపీపీ రవికుమార్ ధ్వజమెత్తారు.