Share News

బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు

ABN , Publish Date - Sep 10 , 2026 | 02:08 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చే క్రమంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. తిరుమలలో బుధవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు పోలీసుశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టిందన్నారు. దర్శనం, వసతి, అన్నప్రసాదం, రవాణా, భద్రత, వైద్యం, పారిశుధ్యం, విద్యుత్‌, పుష్పాలంకరణలు తదితర అన్ని విభాగాల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు.

బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు
తిరుమల అన్నమయ్య భవన్‌లో జరిగిన టీటీడీ బోర్డు సమావేశం

-వాహన సేవల వీక్షణకు, శ్రీవారి దర్శన

కల్పనకు సౌకర్యవంతమైన ఏర్పాట్లు

తిరుమల, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): శ్రీవారి బ్రహ్మోత్సవాలకు దేశం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చే క్రమంలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. తిరుమలలో బుధవారం జరిగిన టీటీడీ బోర్డు సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు పోలీసుశాఖ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో టీటీడీ పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టిందన్నారు. దర్శనం, వసతి, అన్నప్రసాదం, రవాణా, భద్రత, వైద్యం, పారిశుధ్యం, విద్యుత్‌, పుష్పాలంకరణలు తదితర అన్ని విభాగాల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. గత బ్రహ్మోత్సవంలో గరుడసేవ రోజున 6.13 లక్షల మందికి అన్నప్రసాదాలందించగా, ఈసారి 9.30 లక్షల మందికి అందించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు 3,300మంది సిబ్బందిని వినియోగించనున్నట్టు చెప్పారు. పట్టువస్ర్తాలు సమర్పించేందుకు వచ్చే సీఎం 2027కు సంబంధించిన టీటీడీ డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరిస్తారన్నారు.రిటైరైన సీపీఎ్‌స-ఎన్‌పీఎ్‌స పెన్షనర్లు, వారి కుటుంబాలకు ఓపీఎస్‌ పెన్షనర్ల తరహాలో సీహెచ్‌ఎ్‌ఫ సౌకర్యం కల్పిస్తూ తమ బోర్డు తీర్మానం చేసిందన్నారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 48 మంది ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుమలలో పారిశుధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు అదనపు సిబ్బందికి తిరుమలకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు నిర్ణయించామని, దీనికోసం 3 సంవత్సరాలకు రూ.1.60 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. మరోవైపు తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీకి కేటాయించిన టీటీడీ భవనం లైసెన్సు గడువును మరో మూడేళ్లు అంటే ఈ ఏడాది నవంబరు 2 నుంచి 2029 నవంబరు 1వ తేదీ వరకు పొడిగించేందుకు ఆమోదం తెలిపామన్నారు.టీటీడీ ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవోలు శరత్‌, ప్రభల గోపీనాథ్‌, సీవీఎస్వో మురళీకృష్ణ, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.అనంతరం శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు సంబంఽధించిన బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు.స్వామివారికి నిర్వహించే వివిధ వాహనసేవలు, విశేష ఉత్సవాలు, ముఖ్య కార్యక్రమాల వివరాలను భక్తులకు అందుబాటులో ఉంచేలా ఈ పుస్తకాన్ని రూపొందించారు.

Updated Date - Sep 10 , 2026 | 02:08 AM