పట్టాభిరాముడి ఆలయానికి బ్రహ్మోత్సవ శోభ
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:43 PM
వాల్మీకిపురం పట్టాభి రామాలయానికి బ్రహ్మోత్సవ శోభ వచ్చింది.
వాల్మీకిపురం, మార్చి 22(ఆంధ్రజ్యోతి): వాల్మీకిపురం పట్టాభి రామాలయానికి బ్రహ్మోత్సవ శోభ వచ్చింది. సోమవారం అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. మంగళవారం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రారగణాన్ని విద్యుత్ దీపాలు, పూలూపండ్లు, రంగవల్లులతో ముస్తాబు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. రాజగోపురం, మొదలు తిరుమాడ వీధులు, రామాలయం రోడ్డు ప్రాంతాల్లో సీతారాములు, ఆంజనేయస్వామి, వాల్మీకిపురం మహర్షి తదితర దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లు ఏర్పాటు చేశారు. కాగా, పట్టాభిరామాలయం నుంచి బజారు వీధి, తిరుమాడ వీధులు, కొత్తపేట వీధి, ఎల్‌ఆర్ వీధి తదితర ప్రాంతాల్లో మైక్‌సెట్లు ఏర్పాటు చేసి, ఆలయంలో జరిగే కార్యక్రమాలు, శ్రీరాముడి కీర్తనలు, నమో వెంకటేశాయ నామస్మరణలు వినిపించేలా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.