Share News

బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.1.25 కోట్లు

ABN , Publish Date - Jul 14 , 2026 | 01:55 AM

బోయకొండ గంగమ్మ ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా రూ.1.25 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏకాంబరం పేర్కొన్నారు. 54 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలకు సంబంధించి హుండీలను లెక్కించగా రూ .1,25,45,420 నగదు, 43.950 గ్రాముల బంగారు, 550.100 గ్రాములు వెండితో పాటు కొంత విదేశీ కరెన్సీ లభించిందన్నారు.

బోయకొండ గంగమ్మ హుండీ ఆదాయం రూ.1.25 కోట్లు
హుండీ డబ్బులు లెక్కిస్తున్న సిబ్బంది

చౌడేపల్లె, జూలై13(ఆంధ్రజ్యోతి): బోయకొండ గంగమ్మ ఆలయానికి హుండీ లెక్కింపు ద్వారా రూ.1.25 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏకాంబరం పేర్కొన్నారు. 54 రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలకు సంబంధించి హుండీలను లెక్కించగా రూ .1,25,45,420 నగదు, 43.950 గ్రాముల బంగారు, 550.100 గ్రాములు వెండితో పాటు కొంత విదేశీ కరెన్సీ లభించిందన్నారు. ఆలయ చరిత్రలో ఇదే అత్యధిక ఆదాయం. అలాగే అన్నదాన కేంద్రం వద్ద హుండీ ద్వారా రూ.22,179 నగదు, రణబేరి గంగమ్మ ఆలయానికి హుండీ ద్వారా రూ.96,241 ఆదాయంగా భక్తులు సమర్పించారన్నారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయశాఖ ఏసీ విశ్వనాథ్‌, ఆలయ, ఇండియన్‌ బ్యాంకుల సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.

Updated Date - Jul 14 , 2026 | 01:55 AM