శైలశుతిగా బోయకొండ గంగమ్మ
ABN , Publish Date - Oct 14 , 2026 | 01:42 AM
దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు(మంగళవారం)బోయకొండ గంగమ్మ పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు(మంగళవారం)బోయకొండ గంగమ్మ పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో అర్చకులు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని రెండు చేతుల్లో కమలాలు, ఒక చేతిలో శివలింగం, మరో చేయిని అభయ హస్తంగా సర్ణాభరణాలతో పార్వతీదేవిగా అలంకరించారు. ఽధూపదీప, నైవేద్యాలు సమర్పించారు. డార్మిటరీ హా ల్‌లో కలశ స్థాపన చేసి అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకరించారు. ఉభయ దా రులకు అమ్మవారి శేష వస్త్రాలను, తీర్థప్రసాదాలను ఆలయ ఈవో ఏకాంబరం అందజేశారు. అధిక సంఖ్యలో క్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
-చౌడేపల్లె, ఆంధ్రజ్యోతి