Share News

బాంబు బెదిరింపు మెయిల్‌తో కలకలం

ABN , Publish Date - Mar 05 , 2026 | 12:54 AM

బాంబులు పెట్టినట్టు వచ్చిన మెయిళ్లతో తిరుపతిలో మరోసారి కలకలం రేగింది. అలిపిరి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రాజ్‌పార్క్‌ హోటల్‌, కపిలతీర్థం రోడ్డులోని ఇండియన్‌ బ్యాంక్‌లో ఐఈడీ బాంబులు పెట్టినట్టు బుధవారం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి.

బాంబు బెదిరింపు మెయిల్‌తో కలకలం
రాజ్‌పార్క్‌ హోటల్లో తనిఖీలు చేస్తున్న బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌, అలిపిరి పోలీసులు

రాజ్‌పార్క్‌ హోటల్‌, ఇండియన్‌ బ్యాంక్‌లో బాంబ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

తిరుపతి(నేరవిభాగం), మార్చి 4(ఆంధ్రజ్యోతి): బాంబులు పెట్టినట్టు వచ్చిన మెయిళ్లతో తిరుపతిలో మరోసారి కలకలం రేగింది. అలిపిరి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని రాజ్‌పార్క్‌ హోటల్‌, కపిలతీర్థం రోడ్డులోని ఇండియన్‌ బ్యాంక్‌లో ఐఈడీ బాంబులు పెట్టినట్టు బుధవారం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. దీంతో అలిపిరి పోలీసులు, బాంబ్‌స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌ హుటాహుటిన ఇండియన్‌ బ్యాంకుకు, రాజ్‌పార్క్‌ హోటల్‌కు చేరుకున్నారు. రెండు ప్రదేశాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా బాంబులుగాని, ఎటువంటి అనుమానాస్పద వస్తువులుగాని కనిపించలేదని అలిపిరి సీఐ రామకిషోర్‌ తెలిపారు. బాంబు బెదిరింపులపై కేసు నమోదుచేసి, బెదిరింపు మెయిల్‌ పంపిన వ్యక్తిని గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Updated Date - Mar 05 , 2026 | 12:54 AM