బాంబు బెదిరింపు
ABN , Publish Date - Jan 09 , 2026 | 01:36 AM
చిత్తూరు జిల్లా కోర్టుకు గురువారం మధ్యాహ్నం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు ఆందోళనకు గురయ్యారు. కొందరు కక్షిదారులు కోర్టునుంచి బయటకు పరుగులు తీశారు. వివరాలు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం సుమారు 12.20 గంటలకు వచ్చిన మెయిల్‌ను జిల్లా కోర్టు సూపరింటెండెంట్ గమనించారు. అందులో చిత్తూరు కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టామని, పేలుడు పదార్థాలతో కోర్టును ధ్వంసం చేస్తామని, అందరూ బయటకు వెళ్లాలని, మధ్యాహ్నం 1.15గంటలకు పేలుడు సంభవిస్తుందని పేర్కొని ఉంది. ఈ సమాచారం అందడంతో ఎస్పీ తుషార్ అప్రమత్తమయ్యారు. ఆయన ఆదేశాలతో ఏఆర్ అదనపు ఎస్పీ దేవదాస్, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, జిల్లా ఫైర్ ఆఫీసర్, డీఎంహెచ్‌వో, వన్‌టౌన్ సీఐ మహేశ్వర్‌లు బాంబు డిస్పోజబుల్ టీమ్ నాలుగు బృందాలుగా ఏర్పడి కోర్టు వద్దకు చేరుకున్నారు. కోర్టు ప్రాంగణంలో ఉన్న కక్షిదారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. కోర్టు భవనంలోని ప్రతి గది, కారిడార్లు, హాళ్లు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు ఐదు గంటలపాటు సాగిన తనిఖీల అనంతరం కోర్టు ప్రాంగణంలో ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లేవని పోలీసులు నిర్ధారించారు. అనంతరం కోర్టు ప్రాంగణం పూర్తిగా సురక్షితమని న్యాయమూర్తులకు చెప్పడంతో కోర్టులు యథావిధిగా పనిచేశాయి. ఏఎస్పీ రాజశేఖర్ రాజు కోర్టు వద్దకు చేరుకుని తనిఖీలను పర్యవేక్షించారు.
చిత్తూరు కోర్టును
ధ్వంసం చేస్తామని మెయిల్
అప్రమత్తమైన పోలీసులు
న్యాయమూర్తులు, న్యాయవాదులు,
కక్షిదారులు, సిబ్బంది బయటకు తరలింపు
చిత్తూరు లీగల్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా కోర్టుకు గురువారం మధ్యాహ్నం మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు ఆందోళనకు గురయ్యారు. కొందరు కక్షిదారులు కోర్టునుంచి బయటకు పరుగులు తీశారు. వివరాలు ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం సుమారు 12.20 గంటలకు వచ్చిన మెయిల్‌ను జిల్లా కోర్టు సూపరింటెండెంట్ గమనించారు. అందులో చిత్తూరు కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టామని, పేలుడు పదార్థాలతో కోర్టును ధ్వంసం చేస్తామని, అందరూ బయటకు వెళ్లాలని, మధ్యాహ్నం 1.15గంటలకు పేలుడు సంభవిస్తుందని పేర్కొని ఉంది. ఈ సమాచారం అందడంతో ఎస్పీ తుషార్ అప్రమత్తమయ్యారు. ఆయన ఆదేశాలతో ఏఆర్ అదనపు ఎస్పీ దేవదాస్, చిత్తూరు డీఎస్పీ సాయినాథ్, జిల్లా ఫైర్ ఆఫీసర్, డీఎంహెచ్‌వో, వన్‌టౌన్ సీఐ మహేశ్వర్‌లు బాంబు డిస్పోజబుల్ టీమ్ నాలుగు బృందాలుగా ఏర్పడి కోర్టు వద్దకు చేరుకున్నారు. కోర్టు ప్రాంగణంలో ఉన్న కక్షిదారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. కోర్టు భవనంలోని ప్రతి గది, కారిడార్లు, హాళ్లు, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు ఐదు గంటలపాటు సాగిన తనిఖీల అనంతరం కోర్టు ప్రాంగణంలో ఎక్కడా ఎటువంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లేవని పోలీసులు నిర్ధారించారు. అనంతరం కోర్టు ప్రాంగణం పూర్తిగా సురక్షితమని న్యాయమూర్తులకు చెప్పడంతో కోర్టులు యథావిధిగా పనిచేశాయి. ఏఎస్పీ రాజశేఖర్ రాజు కోర్టు వద్దకు చేరుకుని తనిఖీలను పర్యవేక్షించారు.
నగరి కోర్టులోనూ తనిఖీలు
నగరి: జిల్లా కోర్టుకు వచ్చిన బాంబు బెదిరింపు నేపథ్యంలో నగరి కోర్టులోనూ బాంబు, డాగ్ స్క్వాడ్ తనిఖీలు జరిగాయి. కోర్టులో ఉన్న న్యాయవాదులు, కక్షిదారులను బయటకు పంపించి కోర్టు లోపల, పరిసరాల్లో తనిఖీలు చేశారు. బాంబు లేదని నిర్ధారించి వెనుదిరిగారు.