వివరాలు అప్డేట్ చేస్తేనే బిల్లులు స్వీకరణ
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:51 AM
ప్రభుత్వం కోరిన విధంగా అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలు ఇవ్వాలని ఖజానాశాఖ స్పష్టం చేసింది. 10 రోజుల క్రితమే ఈమేరకు ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు డ్రాయింగ్ డిస్బర్స్‌మెంట్ ఆఫీసర్లు (డీడీవోల) ద్వారా తాఖీదులు పంపింది.
ప్రభుత్వం కోరిన విధంగా అధికారులు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలు ఇవ్వాలని ఖజానాశాఖ స్పష్టం చేసింది. 10 రోజుల క్రితమే ఈమేరకు ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు డ్రాయింగ్ డిస్బర్స్‌మెంట్ ఆఫీసర్లు (డీడీవోల) ద్వారా తాఖీదులు పంపింది. మే 1న చెల్లించే ఏప్రిల్ జీతాల బిల్లులు ఈనెల 20-25వ తేదీల మధ్య అన్ని కార్యాలయాలు ఖజానా శాఖకు పంపిస్తాయి. ప్రభుత్వం కోరిన సమగ్ర వివరాలు అందితేనే జీతాల బిల్లులు పాస్‌చేస్తామని స్పష్టం చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు వారి సమాచార హక్కు చట్టం ప్రస్తుత పీఐవో, ఏపీఐవో అధికారుల పేర్లు, ఫోన్ నెంబర్లు తదితర వివరాలను సిస్టంలో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్న స్థల వివరాలు, ల్యాండ్ మార్క్, ఫోన్‌నెంబర్లను నిధి పోర్టల్ ద్వారా అప్డేట్ చేయాలి. తర్వాత కార్యాలయాలకు సంబంధించిన కరెంట్ సర్వీస్ నెంబర్ వివరాలను సీఎఫ్‌ఎంఎస్ పోర్టల్ ద్వారా జీతాల బిల్లులతో పాటు అందజేయాలని తాజాగా ఉత్తర్వులో పేర్కొంది. పాలనలో వేగం, జవాబుదారీతనం పెంచడంలో భాగంగా ఈ వివరాలను అప్డేట్ చేయాలని, లేకుంటే సిస్టం ఏప్రిల్ బిల్లులు స్వీకరించదని స్పష్టం చేసింది.